ఆళ్లగడ్డ: (విభారె న్యూస్): ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవా కార్యకర్త , ఆర్లగడ్డ పట్టణ ఆవోపా సంఘం అధ్యక్షులు శ్రీ టంగుటూరి సత్యనారాయణ విశ్వహిందూ పరిషత్ (VHP) ఆళ్లగడ్డ పట్టణ కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
పట్టణంలోని ఆవుల పుల్లారెడ్డి సేవా సమితి ఫంక్షన్ హాల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ నూతన కమిటీని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్,శ్రీ కమతం రాజశేఖర్ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కిషోర్ కుమార్, ఆళ్లగడ్డ ప్రఖండ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి, బజరంగ్ దళ్ జిల్లా సహకార దర్శి ఈశ్వర ప్రసాద్ రెడ్డి, ఆళ్లగడ్డ ప్రఖండ కార్యదర్శి మురళి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ, హిందూ ధర్మ రక్షణకు మరియు సేవా కార్యక్రమాల విస్తరణకు నూతన కమిటీ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
టంగుటూరి సత్యనారాయణ నియామకం పట్ల పట్టణంలోని పలువురు ప్రముఖులు, వ్యాపార వర్గాలు మరియు హిందూ బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. సత్యనారాయణ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని పేర్కొన్నారు.