పూర్వ సైనిక్ పరిషత్ (వి.హెచ్‌.పి) ఆళ్లగడ్డ పట్టణ అధ్యక్షుడిగా శ్రీ వి. రామసుబ్బయ్య ఎన్నిక

​విభారె న్యూస్::ఆళ్ళగడ్డ: ఆళ్లగడ్డ పట్టణ పూర్వ సైనిక్ పరిషత్ (VHP) నూతన అధ్యక్షుడిగా రిటైర్డ్ సైనికోద్యోగి శ్రీ వి. రామసుబ్బయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.పట్టణంలోని ఆవుల పుల్లారెడ్డి సేవా సమితి ఫంక్షన్ హాల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ నూతన కమిటీని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ శ్రీ కమతం రాజశేఖర్ రెడ్డి . జిల్లా విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి. శ్రీ కిషోర్ కుమార్ ఆళ్లగడ్డ ప్రఖండ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి బజరంగ్ దళ్ జిల్లా సహ కార్యదర్శి ఈశ్వర ప్రసాద్ రెడ్డి, ఆళ్లగడ్డ ప్రఖండ కార్యదర్శి మురళి మరియు సభ్యులు డి.దేవేందర్ నాథ్ రెడ్డి, సి.రాందాస్, గోవిందరాజులు,ఆచారి,సివి.సుబ్బయ్య ఎం.ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ, హిందూ ధర్మ రక్షణకు మరియు సేవా కార్యక్రమాల విస్తరణకు పూర్వ సైనిక పరిషత్ నూతన కమిటీ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రామసుబ్బయ్య నియామకం పట్ల పట్టణంలోని పలువురు ప్రముఖులు, మాజీ సైనికులు మరియు హిందూ బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రామ సుబ్బయ్య గారు మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని పేర్కొన్నారు.