గో రక్షా దళ్ (VHP) ఆళ్లగడ్డ పట్టణ అధ్యక్షుడిగా ఎం.బలరాం నియామకం

ఆళ్లగడ్డ (విభారె): ఆళ్లగడ్డ పట్టణ గో రక్షా దళ్ (విశ్వ హిందూ పరిషత్ ) నూతన అధ్యక్షుడిగా ఎం.బలరాం నియమితులయ్యారు. ఈ మేరకు పట్టణ కమిటీ సభ్యులు మరియు వి.హెచ్.పి ఉన్నతాధికారులు ఆయనను ఏకగ్రీవంగా తీర్మానించారు.
పట్టణంలోని ఆవుల పుల్లారెడ్డి సేవా సమితి ఫంక్షన్ హాల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ నూతన కమిటీని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ శ్రీ కమతం రాజశేఖర్ రెడ్డి గారు,జిల్లా విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి శ్రీ కిషోర్ కుమార్ గారు, ఆళ్లగడ్డ ప్రఖండ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి, బజరంగ్ దళ్ జిల్లా సహ కార్యదర్శి ఈశ్వర ప్రసాద్ రెడ్డి, ఆళ్లగడ్డ ప్రఖండ కార్యదర్శి మురళి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ, హిందూ ధర్మ రక్షణకు మరియు సేవా కార్యక్రమాల విస్తరణకు నూతన కమిటీ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

            పట్టణంలో గో సంరక్షణ ధ్యేయంగా, గోవుల అక్రమ రవాణా నిరోధానికి మరియు నిస్సహాయ స్థితిలో ఉన్న గోవులకు రక్షణ కల్పించేందుకు తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా బలరాం పేర్కొన్నారు. సనాతన ధర్మంలో గోమాతకు విశిష్ట స్థానం ఉందని, ప్రతి ఒక్కరూ గో సేవలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
            బలరాం నియామకం పట్ల స్థానిక హిందూ ధర్మ ప్రచారకులు, పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో పట్టణ కమిటీని మరింత బలోపేతం చేసి, సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.