బజరంగ్ దళ్ (వి.హెచ్.పి) ఆళ్లగడ్డ పట్టణ అధ్యక్షుడిగా గాండ్ల చంద్ర సేన ఎంపిక

ఆళ్లగడ్డ (విభారె న్యూస్): ఆళ్లగడ్డ మునిసిపాలిటీ పరిధిలోని పడకండ్ల గ్రామానికి చెందిన, సామాజిక సేవా కార్యకర్త , గాండ్ల చంద్ర సేన (VHP) ఆళ్లగడ్డ పట్టణ కమిటీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
పట్టణంలోని ఆవుల పుల్లారెడ్డి సేవా సమితి ఫంక్షన్ హాల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ నూతన కమిటీని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ శ్రీ కమతం రాజశేఖర్ రెడ్డి గారు,జిల్లా విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి. శ్రీ కిషోర్ కుమార్ గారు, ఆళ్లగడ్డ ప్రఖండ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి,బజరంగ్ దళ్ జిల్లా సహ కార్యదర్శి ఈశ్వర ప్రసాద్ రెడ్డి, ఆళ్లగడ్డ ప్రఖండ కార్యదర్శి మురళి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ, హిందూ ధర్మ రక్షణకు మరియు సేవా కార్యక్రమాల విస్తరణకు నూతన కమిటీ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
గాండ్ల చంద్ర సేన నియామకం పట్ల పట్టణంలోని పలువురు ప్రముఖులు, సామాజిక సేవకులు మరియు హిందూ బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్ర సేన మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని పేర్కొన్నారు