విభారె న్యూస్ :: ఆళ్ళగడ్డ: ఆళ్లగడ్డ పట్టణ వైదిక మంగళ వాయిద్య విభాగం ( విశ్వహిందూ పరిషత్ ) నూతన అధ్యక్షుడిగా భజంత్రి బాల హుస్సేనయ్య నియమితులయ్యారు. .పట్టణంలోని ఆవుల పుల్లారెడ్డి సేవా సమితి ఫంక్షన్ హాల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ నూతన కమిటీని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ నంద్యాల జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ శ్రీ కమతం రాజశేఖర్ రెడ్డి, జిల్లా విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి శ్రీ కిషోర్ కుమార్ ఆళ్లగడ్డ ప్రఖండ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి, బజరంగ్ దళ్ జిల్లా సహ కార్యదర్శి ఈశ్వర ప్రసాద్ రెడ్డి, ఆళ్లగడ్డ ప్రఖండ కార్యదర్శి మురళి మరియు వైదిక మంగళ వాయిద్య విభాగ సభ్యులు భజంత్రి బాల హుస్సేనయ్య ,భజంత్రి బాల దస్తగిరి, ఈశ్వర్, కిట్టు, రామ్మోహన్,శివ ప్రసాద్, సంజీవ, నాగేష్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ, హిందూ ధర్మ రక్షణకు మరియు సేవా కార్యక్రమాల విస్తరణకు నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు.
భజంత్రి బాల హుస్సేనయ్య నియామకం పట్ల పట్టణంలోని పలువురు ప్రముఖులు, మంగళ వాయిద్య కళాకారులు మరియు హిందూ బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భజంత్రి బాల హుస్సేనయ్య మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని పేర్కొన్నారు.