చిన్న బోధనం సర్పంచుగా యామా నరసమ్మ గెలుపు

ఆళ్లగడ్డ :: (విభారె న్యూస్) :: ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం, చాగలమర్రి మండలంలోని చిన్న బోధనం గ్రామ సర్పంచ్ పదవిని వైసిపి మద్దతుదారు యామా నరసమ్మ భారీ మెజార్టీతో విజయం సాధించారు. తెలుగుదేశం మద్దతుదారు యామా లక్ష్మీదేవి పై 519 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ మేరకు అధికారుల నుండి ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.