కోయిల్‌ సాగర్‌కు పరుగులెత్తిన కష్ణమ్మ

మరికల్‌- జ్యోతి న్యూస్‌ 
ఎన్నోరోజులుగా కోయిల్‌ సాగర్‌ ఆయకట్టు రైతులు ఎదురు చూస్తున్న క ష్ణా నీళ్లు ఎట్టకేలకు గురువారం నుండి కోయిల్‌ సాగర్‌కు రావడం ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే ఎస్‌. రాజేందర్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు తీలేరు దగ్గర మోటర్‌ ఆన్‌ చేసి కాలువలోకి నీటిని వదిలారు. ఈ సందర్భంగా క ష్ణమ్మకు ఎమ్మెల్యే, కలెక్టర్‌ ప్రత్యేకంగా పూజలు చేశారు.దీంతో ఆయకట్టుదారుల ఆనందం వ్యక్తం చేశారు. రెండు మోటార్ల ద్వారా నీళ్లు ఎత్తు పోయాల్సి ఉండగా కేవలం ఒక మోటార్‌ ద్వారానే నీళ్లు వదలడం జరిగింది. ఇంకా ఒక మోటార్‌ ప్రారంభం కాలేదు. మోటార్లు మరమ్మత్తులు రావడం వలన ఆలస్యం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. తొందరలోనే మరమ్మతులు పూర్తి చేసి కోయిల్‌ సాగర్‌ కు పూర్తిస్థాయిలో నీటి ఎత్తిపోతల ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఇబ్బందులు పడవద్దని కోయిల్‌ సాగర్‌ కు పూర్తిస్థాయి నీటిని అందిస్తామని తెలిపారు. జూరాలకు ఇంకా వరద వస్తున్న అందువలన కోయిల్‌ సాగర్‌ నింపడానికి నీటి లభ్యత పుష్కలంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఇప్పటికే నీళ్లు వదిలి ఉంటే తాము వ్యవసాయ పనులు మొదలు పెట్టే వాళ్ళమని పేర్కొన్నారు. భూగర్భ జలాలు కూడా పెరిగేవని తద్వారా పంటలకు ఇబ్బంది ఉండేది కాదని రైతులు అధికారులతో వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించడం ఆనందంగా ఉందని తెలిపారు. కోయిల్‌ సాగర్‌ ను పూర్తిస్థాయిలో నింపాలని అధికారులను రైతులు డిమాండ్‌ చేశారు. ,రైతులు క్రిష్ణ రెడ్డి,బగవంతు పంట సాగు విషయమై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మరికల్‌ ఎస్‌ ఐ జానకి రామిరెడ్డి, జెడ్‌ పి టి సి సురేఖ ,తీలేర్‌ మాజీ ఎంపీటీసీ అశోక్‌, వెంకట్రామీరెడ్డి,సంపత్‌ కుమార్‌, తిరుపతియ్య, బి కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.