అమరావతి పనులు పూర్తిగా పడకేశాయి

– పనులు ప్రారంభించే సామర్థ్యం వైకాపాలో కొరవడింది  – పొరుగు రాష్ట్రాలకు పండగ, ఏపీకి దండగలా జగన్‌ పాలన  – టెలీకాన్ఫరెన్స్‌లో…

సీఎం సీటు కావాలంటే తీసుకోండి

– నేనెప్పుడూ అధికారంకోసం భాజపా వద్దకు వెళ్లలేదు – వారే నా దగ్గరకు వచ్చారు  – కాంగ్రెస్‌ కోరడం వల్లే సీఎంగా…

కళ్యాణలక్ష్మికి కష్టాలు

నెలల తరబడి కదలని దరఖాస్తులు సిద్దిపేట,జూలై19:- పేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందని భావించిన కల్యాణలక్ష్మి ఏడాదిగా నిలిచిపోవడం పలు కుటుంబాల్లో సమస్యగా మారింది. వరుసగా ఎన్నికల కోడ్‌ అమలులోఉండటం వల్ల కల్యాణలక్ష్మి ్గ/ళ్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇపుడు ఎన్నికల కోడ్‌ ముగిసినా దరఖాస్తుల పరిష్కారంలో వేగం పుంజుకోవడం లేదు. మునిసిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకాకముందే సహాయం అందించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. జిల్లాలో ఏడాది నుంచి పేదింటి ఆడబిడ్డలను కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కరుణించడం లేదు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకుఅండగా నిలుస్తుందని ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టింది. కానీ ఆచరణలో మాత్రం విఫలమవుతున్నది. పెళ్లికాగానే దరఖాస్తు చేసుకుని అనేక మంది మంజూరుకోసం ఎదురుచూస్తున్నారు. ఏడాది దాటినా కల్యాణలక్ష్మి చెక్కులు అందకపోవడంతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కిందపట్టణ ప్రాంతాలలో వార్షికాదాయం రూ.2లక్షలలోపు, గ్రావిూణ ప్రాంతాలలో వార్షికాదాయం రూ.లక్ష లోపు ఉన్న అల్పాదాయ వర్గాల కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.1,00, 116లుఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. కొన్ని కుటుంబాలు ఈ డబ్బు వస్తుందన్న ధీమాతో అప్పోసప్పో చేసి పెళ్లిళ్లు చేశాయి. ఏడాది కాలంగా ఈ పథకం కింద ఆర్థిక సహాయంఅందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పెండింగ్‌లో ఉన్న వాటిలో ఎస్సీ డెవలప్‌మెంట్‌ పరిధిలో 473 దరఖాస్తులు, ఎస్టీ వెల్ఫేర్‌ కింద 118, బీసీ వెల్‌ఫేర్‌ కింద 2,670, ఈబీసీలు 393 మంది, మైనార్టీలకు చెందిన 174 దరఖాస్తులున్నట్లు అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి. నెలల తరబడి దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. నిబంధనల ప్రకారం సాధారణంగాఅర్హులైన వారు తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే వారు తనిఖీ చేసి అర్హులను గుర్తించిన తర్వాత శాసనసభ్యుల కార్యాల యాలకు పంపిస్తారు. వారి ఆమోదం తర్వాత ఆర్డీవోలకు పంపిస్తే వారిసిఫారసు మేరకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవుతాయి. ఒక్కొక్క దశలో 20 రోజుల నుంచి నెల రోజులకు పైగా వేచి చూడాల్సి వస్తుండటంతో 45 రోజుల్లో పరిష్కరించాల్సిన దరఖాస్తులకునెలల తరబడి మోక్షం లబించడం లేదు. గత సంవత్సరం అక్టోబరు నుంచి వరుసగా ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. మధ్యలో కొద్ది రోజుల విరామం దొరికినా పనులు కాలేదు. ఎన్నికల కోడ్‌ ముగిసి నెలలు గడుస్తున్నాఇపుడు అదే పరిస్థితి కొనసాగుతున్నది. 

వ్యవసాయ అవగాహన సదస్సులు వెనక్కి మళ్లీ మొదటికొచ్చిన అధికారులు

వరంగల్‌,జూలై 19(జ్యోతి న్యూస్):-:-వ్యవసాయంలో రైతులకు మెళకువలపై ప్రతియేటా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు సదస్సులను నిర్వహించేవారు. సాగులో సలహాలు, సూచనలతో పాటురైతు సదస్సుల ద్వారా విస్తృతపరిచేవారు. రెండేళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మన తెలంగాణ?మన వ్యవసాయ కార్యక్రమం ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతోపూర్తిగా నీరుగారిపోతుంది. 2018 ఖరీఫ్‌ నుంచి ఈ రైతు సదస్సులను నిర్వహించిన దాఖలాలు లేవు. మారుతున్న వాతావరణ పరిస్థితు లకు అనుగుణంగా ఎలాంటి పంటలు పండించుకోవాలన్నఅవగాహన కొరవడింది. గతంలో మన తెలంగాణ మన వ్యవసాయం పేరిట గ్రామాల్లో రైతు చైతన్య సదస్సుల నిర్వహణను నిర్వహించారు. ప్రస్తుతం రెండేళ్ల నుంచి రైతు సదస్సుల ఊసే లేకుండా పోయింది. ఏటా ఖరీఫ్‌కు నెల ముందువ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అనుబంధ శాఖల సమక్షంలో సూచనలు అందించి సాగుకు రైతులను సన్నద్ధం చేసేవారు. కానీ వ్యవసాయశాఖ అధికారులు సలహాలు, సూచనలు రైతులకు అందకతీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కొంతమంది రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలపై అవగాహన ఉండటం లేదు. రైతులు ఎక్కువగా రసాయన ఎరువులను వాడడంతో భూముల్లోనిభూసారాన్ని కోల్పోతున్నారు. పెట్టుబడి ఖర్చులు పెరిగి దిగుబడి అంతంత మాత్రమే వస్తుండడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. వ్యవసాయశాఖతోపాటు పశుసంవర్ధక, ఉద్యానవన పట్టుపరిశ్రమ, మత్స్యశాఖ, మార్కెటింగ్‌, అటవీ, బ్యాంకింగ్‌, రెవెన్యూ, విద్యుత్‌, సూక్ష్మ నీటి సేద్యం, నీటిపారుదల శాఖ తదితర శాఖలున్నాయి. శాఖల ద్వారా రైతులకు ప్రయోజనాలు రాయితీ తదితరఅంశాలపై అవగాహన కల్పించేవారు. 

‘పుర’ పోరు దసరాకే!

కోర్టు కేసులు, ప్రతిపక్షాల ఒత్తిడి, అన్ని పట్టణాలనుంచి ఫిర్యాదుల వెల్లువ  ----------------------------------------------  - గందరగోళంగా వార్డులు, డివిజన్లు  -ప్రతి పట్టణంలో ఫిర్యాదుల…

తొలిరోజు మంచి కలెక్షన్స్‌ రాబట్టిన ఇస్మార్ట్‌ శంకర్‌

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ బాక్సాఫీసు వద్ద మాయ చేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’…

నూతన చట్టంతోనే పారదర్శకత

– అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం  – అక్రమమని తేలితే నోటీసులివ్వకుండానే కూల్చేస్తాం – 75గజాలలోపు ఇంటినిర్మాణానికి రిజిస్టేష్రన్‌ ఫీజు కేవలం…

ఎయిర్‌టెల్‌కు మరోసారి జియో షాక్‌

ముంబై : రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ మరోసారి లాభదాయకమైన టెలికాం ఆపరేటర్‌గా నిలిచింది. ముఖ్యంగా  మొబైల్ చందాదారుల పరంగా  ప్రత్యర్థి భారతి ఎయిర్‌టెల్‌ను అధిగమించి…

సీఎం జగన్‌పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత పురందేశ్వరి. విశాఖలో కేవలం చర్చిలకు మాత్రమే భద్రత కల్పిస్తూ…

బొప్పాయితో బోలెడు లాభాలు

బొప్పాయి పండు అందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ పండుకు సులువుగా ఇంట్లో దొరికే ఇతర పదార్థాలను కలిపితే సౌందర్యం ఇనుమడిస్తుంది. బొప్పాయి…