ఆళ్లగడ్డ లో జాబ్ మేళా : మూడు వందల ఇరవై మందికి ఉద్యోగాలు.


ఆళ్లగడ్డ ::(విభారె న్యూస్) ఆళ్లగడ్డ పట్టణంలోని కెవి సుబ్బారెడ్డి కళాశాలలో డి.ఆర్.డి.ఎ మరియు స్పీడప్ సంస్థల ఆధ్వర్యంలో నిరుద్యోగుల కొరకు జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళా లో 806 మంది నిరుద్యోగులు వివిధ కంపెనీలు నిర్వహించిన ఎంపిక పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 320 మంది నిరుద్యోగులు వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. గూగుల్ కంపెనీ 156 మంది, హానర్ ల్యాబ్స్ 26 మంది, మెడ్ ప్లస్ 26 మంది, అమర రాజా బ్యాటరీస్ 28 మంది, టెక్ మహీంద్రా 83 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో ఏరియా కోఆర్డినేటర్ డి దానం, ఏ పి ఎం రామ శేఖర్ రెడ్డి మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఇలాంటి జాబ్ మేళా లు నిర్వహించడం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించిన డి ఆర్ డి ఎ మరియు స్పీడ్ అప్ సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేశారు.