ఆళ్లగడ్డలో ముగిసిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం

విభారె న్యూస్:ఆళ్లగడ్డ:
ఆళ్లగడ్డ పట్టణంలోని ఆవుల పుల్లారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థినులకు సేవా సమితి అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు లతా రెడ్డి సర్టిఫికెట్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఆవుల విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, నేటి నిత్యజీవితంలో కంప్యూటర్ విద్య ఎంతో అవసరమని తెలిపారు. ఎంత ఉన్నత విద్యను అభ్యసించినా కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోతే ఆ విద్య పూర్తి స్థాయిలో ఉపయోగపడదని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో మహిళలు ఎప్పుడూ ముందుంటారని, వారి సాంకేతిక నైపుణ్యాలు సమాజ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని అన్నారు.

శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థినులు తాము నేర్చుకున్న కంప్యూటర్ నైపుణ్యాలను ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారు. కార్యక్రమంలో ఉత్తమ కంప్యూటర్ శిక్షణ అందించిన అధ్యాపకులు పుల్లయ్యను ఘనంగా సత్కరించారు.

త్వరలోనే ఉచిత కంప్యూటర్ శిక్షణకు సంబంధించిన సాయంత్రం బ్యాచ్ తరగతులను ప్రారంభించనున్నట్లు, వాటి తేదీలను త్వరలో ప్రకటిస్తామని సమితి అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థినులు మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.