ఆళ్లగడ్డ :: జూలై 24 : (విభారె న్యూస్): కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ప్రజలకు సేవలు అందించడానికి మరో సంస్థ ఆవిర్భవించింది. ఈరోజు ఆళ్లగడ్డ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. గతంలో లలిత కళా సమితి పేరుతో ఒక సంస్థను స్థాపించి అనేక మంది కళాకారులను ప్రోత్సహించి, నూతన కళాకారులకు అవకాశం కల్పించి లలిత కళల పట్ల తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్న విశ్రాంత న్యాయమూర్తి కాశీభట్ల శివప్రసాద్ గారు లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా బంగారు రాము యాదవ్, ఉపాధ్యక్షుడుగా డాక్టర్ గంగన్న, కోశాధికారిగా వెంకటేశ్వర్ రెడ్డి , సభ్యులుగా మాజీ జెడ్పిటిసి చాంద్బాషా, మల్లికార్జునరావు, రామాంజనేయులు, డాక్టర్ ఆంజనేయులు యాదవ్, శ్రీనివాసులు, శ్రీరాములు ఎంపికయ్యారు. ఏది ఏమైనా అనేక మంది ప్రముఖుల కలయికతో ఆవిర్భవించిన లయన్స్ క్లబ్ నుండి ఆళ్లగడ్డ పట్టణవాసులకు మరిన్ని సేవలు లభిస్తాయని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.