ఆళ్లగడ్డలో విశ్వహిందూ పరిషత్ పట్టణ కమిటీల నియామకం పూర్తి

ఆళ్లగడ్డ (విభారె న్యూస్):ఆళ్లగడ్డ పట్టణ విశ్వహిందూ పరిషత్ (VHP) అనుబంధ విభాగాల కమిటీల ప్రక్రియ విజయవంతంగా పూర్తయినట్లు ఆళ్లగడ్డ ప్రఖండ అధ్యక్షులు ఆవులవిజయభాస్కర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. హిందూ ధర్మ రక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలను బలోపేతం చేసే దిశగా ఈ నూతన కార్యవర్గాలను ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

నూతనంగా ఎన్నికైన కమిటీ అధ్యక్షులు:

విశ్వహిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు: టంగుటూరి సత్యనారాయణ, బజరంగ్ దళ్ పట్టణ అధ్యక్షులు:గాండ్ల చంద్రసేన, పూర్వ సైనిక్ విభాగం పట్టణ అధ్యక్షులు:

వి. రామసుబ్బయ్య, గో రక్షా దళ్ కమిటీ అధ్యక్షులు:ఎం. బలరాం, వైదిక మంగళ వాయిద్య విభాగం అధ్యక్షులు:భజంత్రీ బాల హుస్సేనయ్య నియమితులయ్యారు

 ఈ కార్యక్రమంలో శ్రీ బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి (VHP జిల్లా అధ్యక్షులు),శ్రీ కిషోర్ కుమార్ (VHP జిల్లా కార్యదర్శి), కమతం రాజశేఖర్ రెడ్డి (బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్),ఈశ్వర ప్రసాద్ రెడ్డి (బజరంగ్ దళ్ జిల్లా సహకార దర్శి), మురళి (VHP ఆళ్లగడ్డ పఖండ ప్రధాన కార్యదర్శి) పాల్గొన్నారు.

              నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులకు జిల్లా నాయకత్వం అభినందనలు తెలియజేస్తూ, పట్టణ కమిటీల అభివృద్ధికి మరియు ధర్మ ప్రచారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.