విభారె న్యూస్ నంద్యాల మా ప్రతినిధి డిసెంబర్ 29- నంద్యాల పట్టణ బీజేపీ అద్యక్ష్యులుగా కసెట్టి చంద్రశేఖర్ ను నియమించినట్లు జిల్లా బీజేపీ అధ్యక్షురాలు డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. శుక్రవారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా వున్న బీజేపీ కార్యాలయం లో బీజేపీ అసెంబ్లీ కార్యకర్తల సమావేశానికి నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మదు,కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు డాక్టర్ బైరెడ్డి శబరి ముఖ్యఅతిదులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నంద్యాల బీజేపీ పట్టణ అధ్యక్షులుగా కసెట్టి చంద్రశేఖర్ ను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు.దేశంలో బీజేపీ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆర్య వైశ్య మహిళలు పార్టీలో చేరడం సంతోషంగా వుందని బైరెడ్డి శబరి పేర్కొన్నారు.నూనె పల్లె ఆర్య వైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు జక్కా రాజేశ్వరి,కాల్వ పద్మావతి, నిచ్చెన మెట్ల సుధా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కర్నూల్,నంద్యాల లో పార్టీ బలోపేతం చేయడానికి బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వార్డు,గ్రామాల్లో త్వరలో కమిటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో కసెట్టి కృష్ణమూర్తి,మాజీ కౌన్సిలర్ మేడా మురళీధర్,డాక్టర్ ఇంటి అధి నారాయణ,శ్రీ లక్ష్మి,స్వాతి,గంగాధర్ నియోజక వర్గంలోని ముఖ్య నాయకులు హాజరయ్యారు.