విభారె న్యూస్: నంద్యాల మా ప్రతినిధి :మే9: హనుమాన్ జయంతి సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మే 12న భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు న్యాయవాది, సీనియర్ జర్నలిస్ట్, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. హిందూ ధర్మ రక్షణ, హిందూ ఐక్యత చాటే లక్ష్యంతో ఈ ర్యాలీని ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
సాయంత్రం 4 గంటల నుండి 4.30 గంటల మధ్య ఆవుల పుల్లారెడ్డి సేవాసమితి వద్ద ప్రారంభమయ్యే ఈ ర్యాలీ నాలుగు రోడ్ల కూడలి, గాయత్రి టెంపుల్, నంద్యాల రోడ్డు, కోదండ రామాలయం, పాత బస్టాండు, విశ్వరూప ఆచారి కాలనీ, పాత బస్టాండ్, మునిసిపల్ ఆఫీస్, పడకండ్ల శారద నగరం, సత్రం వీధి, భారతీయ విద్యా మందిరం మీదుగా శివాలయం వరకు కొనసాగనుంది.
హిందూ బంధువులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత మోటార్ సైకిళ్లతో ర్యాలీలో పాల్గొని హిందూ సమైక్యతను చాటాలని కోరారు. హనుమాన్ భక్తి, ధర్మ పరిరక్షణ, సామాజిక ఐక్యతకు ఈ ర్యాలీ ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పట్టణంలోని పలు హిందూ సంఘాల నాయకులు, యువత, భక్తులు పాల్గొననున్నట్లు వెల్లడించారు.