ఆళ్లగడ్డలో ఈనెల 10వ తేదీన నంద్యాల జిల్లా స్థాయి యోగా పోటీలు:: ఆవుల విజయభాస్కర్ రెడ్డి

ఆళ్లగడ్డ :: ఆగస్టు 9 :: (విభారె న్యూస్) :: ఆళ్లగడ్డ పట్టణంలోని ఆవుల పుల్లారెడ్డి సేవాసమితి యోగా హాల్ నందు ఈనెల 10వ తేదీన ఆదివారం నాడు నంద్యాల జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా యోగ అస్సోసియేషన్ ఛైర్మెన్ ఆవుల విజయ భాస్కరెడ్డి తెలియజేసారు. యోగ సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ బాల బాలికల మరియు స్త్రీ పురుషుల విభాగంలో యోగ ఎంపిక పోటీలు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ యోగా ఎంపిక పోటీలకు హాజరు అయ్యే
క్రీడాకారులు ఆధార్ కార్డు జిరాక్స్, స్కూల్ బోనఫైడ్ సర్టిఫికెట్ మరియు పాస్ పోర్ట్ సైజు ఫోటోలతో రావలెను. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జరగబోయే రాష్ట్రాస్థాయి పోటీలకు నంద్యాల జిల్లా జట్టుకు ప్రాతినిద్యం వహిస్తారని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు 9440826259, 9866136324 మొబైల్ నెంబర్ లను సంప్రదించగలరు..