దేవాలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి బోనాల పండగతో పారిశుద్ద్యం పెంచాలి

కలెక్టర్‌ మేడ్చల్‌,జూలై20: జిల్లాలో బోనాల పండుగను పురస్కరించుకొని దేవాలయ పరిసర ప్రాంతాలు, రోడ్లు శుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఎంవీరెడ్డి…

ఇంటికో మొక్కను నాటుకోవాలి హరితహారంలో భాగస్వాములు కావాలి

కలెక్టర్‌ యాదాద్రి,జూలై20: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని కలెక్టర్‌ అనితారాంచంద్రన్‌ అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం…

బిజెపి బలోపేతం లక్ష్యంగా కార్యక్రమాలు అభివృద్దిని ప్రతి ఒక్కరూ స్వాగతించాలి

కామారెడ్డి,జూలై20: దేశంలో అవినీతిని అంతం చేయడానికి తీసుకున్న చర్యల్లో పెద్ద నోట్ల రద్దు జిఎస్టీ అమలు వంటివి విప్లవాత్మకమైనవని బిజెపి జిల్లా…

నాలుగు మున్సిపాలిటీల్లో మహిళలదే పైచేయి వారికే రిజర్వ్‌ అయ్యే అవకాశాలు

నిజామాబాద్‌,జూలై19(జ్యోతి న్యూస్):-:-రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదల చేసిన ఎన్నికలను నిర్వహించే విధంగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో మాత్రం మహిళల ఓటర్లదే పైచేయిగా ఉంది. న్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఓటరు జాబితాను ప్రకటించారు. ఈ జాబితాల ఆధారంగానే ఎన్ని కలనునిర్వహించనున్నారు. మొత్తం నాలుగు మున్సిపాలిటీల పరిధిలో బీసీలతో పాటు మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. గత సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్ని కలలాగానే ఈఎన్నికలలో కూడా మహిళల ఓటర్లు అధికంగా ఉన్నారు. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్‌లతో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా వారే ఎక్కువగా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీ లలో యాభై శాతం రిజర్వేషన్‌ ఉండడం వల్ల వచ్చే ఎన్నికల్లో వారికే ఎక్కువగా అవకాశాలు రానున్నాయి. గత మున్సిపల్‌ ఎన్నికలలో నిజామాబాద్‌ కార్పొరేషన్‌, ఆర్మూర్‌ మున్సిపల్‌ మేయర్‌, ఛైర్మన్‌ పదవులు వారికే రిజర్వ్‌ అయ్యాయి. ఈ దఫా నాలు గు మున్సిపాలిటీలలో రెండు వారికే రిజర్వ్‌ అయ్యే అవకాశాలుకనిపిస్తున్నాయి. బీసీ జనాభా ఎక్కువగా ఉండడం వల్ల ఈ దఫా ఎక్కువ మున్సిపాలిటిలలోని పదవులపై ఆ వర్గం వారు కన్నేశారు. మున్సిపల్‌ ఎన్నికలకు రంగం సిద్ధం కావడంతో అధికారులుఎన్నికలకు కావలసిన అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే వార్డుల పునర్విభజన చేసిన అధికారులు ఓటరు జాబితాను ప్రకటించారు. సిబ్బంది శిక్షణలో నిమగ్నం అయ్యారు.రాష్ట్ర ఎన్నికలసంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు మున్సిపల్‌ ఎన్నికల కు సిద్ధం అవుతున్నారు. నిజామాబాద్‌ నగర కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 2,99,261 మంది ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 1,52,583 మంది ఉన్నారు. బోధన్‌ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ఓటర్లు 62,448 మంది ఉండగా, స్త్రీ ఓటర్లు 31, 633 మంది ఉన్నారు. ఈ మున్సిపాలిటీ పరిధిలో పురుషుల కంటే స్త్రీ ఓటర్లే ఎ క్కువగా ఉన్నారు. భీమ్‌గల్‌ మున్సిపాలిటి పరిధిలో మొత్తం ఓటర్లు 11,349 మంది ఉండగా స్త్రీ ఓటర్లు 5895 మంది ఉన్నారు. ఆర్మూర్‌ మున్సిపాలిటిలో మొత్తంఓటర్లు 54, 808 మంది కాగా వారిలో స్త్రీ ఓటర్లు 28,271 మంది ఉన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఆర్‌వోలు, ఏఆర్‌ వోలతోపాటు ఎన్నికల సిబ్బందికి శిక్షణను ఇచ్చారు. బ్యాలెట్‌ బాక్సులను సమకూర్చారు. నోటిఫికేషన్‌ ఎప్పుడు వచ్చినా ఎన్నికలు నిర్వహించే విధంగా ఈ ఏర్పాట్లు చేశారు. 

కళ్యాణలక్ష్మికి కష్టాలు

నెలల తరబడి కదలని దరఖాస్తులు సిద్దిపేట,జూలై19:- పేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందని భావించిన కల్యాణలక్ష్మి ఏడాదిగా నిలిచిపోవడం పలు కుటుంబాల్లో సమస్యగా మారింది. వరుసగా ఎన్నికల కోడ్‌ అమలులోఉండటం వల్ల కల్యాణలక్ష్మి ్గ/ళ్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇపుడు ఎన్నికల కోడ్‌ ముగిసినా దరఖాస్తుల పరిష్కారంలో వేగం పుంజుకోవడం లేదు. మునిసిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకాకముందే సహాయం అందించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. జిల్లాలో ఏడాది నుంచి పేదింటి ఆడబిడ్డలను కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కరుణించడం లేదు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకుఅండగా నిలుస్తుందని ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టింది. కానీ ఆచరణలో మాత్రం విఫలమవుతున్నది. పెళ్లికాగానే దరఖాస్తు చేసుకుని అనేక మంది మంజూరుకోసం ఎదురుచూస్తున్నారు. ఏడాది దాటినా కల్యాణలక్ష్మి చెక్కులు అందకపోవడంతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కిందపట్టణ ప్రాంతాలలో వార్షికాదాయం రూ.2లక్షలలోపు, గ్రావిూణ ప్రాంతాలలో వార్షికాదాయం రూ.లక్ష లోపు ఉన్న అల్పాదాయ వర్గాల కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ.1,00, 116లుఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. కొన్ని కుటుంబాలు ఈ డబ్బు వస్తుందన్న ధీమాతో అప్పోసప్పో చేసి పెళ్లిళ్లు చేశాయి. ఏడాది కాలంగా ఈ పథకం కింద ఆర్థిక సహాయంఅందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పెండింగ్‌లో ఉన్న వాటిలో ఎస్సీ డెవలప్‌మెంట్‌ పరిధిలో 473 దరఖాస్తులు, ఎస్టీ వెల్ఫేర్‌ కింద 118, బీసీ వెల్‌ఫేర్‌ కింద 2,670, ఈబీసీలు 393 మంది, మైనార్టీలకు చెందిన 174 దరఖాస్తులున్నట్లు అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి. నెలల తరబడి దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. నిబంధనల ప్రకారం సాధారణంగాఅర్హులైన వారు తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకుంటే వారు తనిఖీ చేసి అర్హులను గుర్తించిన తర్వాత శాసనసభ్యుల కార్యాల యాలకు పంపిస్తారు. వారి ఆమోదం తర్వాత ఆర్డీవోలకు పంపిస్తే వారిసిఫారసు మేరకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవుతాయి. ఒక్కొక్క దశలో 20 రోజుల నుంచి నెల రోజులకు పైగా వేచి చూడాల్సి వస్తుండటంతో 45 రోజుల్లో పరిష్కరించాల్సిన దరఖాస్తులకునెలల తరబడి మోక్షం లబించడం లేదు. గత సంవత్సరం అక్టోబరు నుంచి వరుసగా ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంది. మధ్యలో కొద్ది రోజుల విరామం దొరికినా పనులు కాలేదు. ఎన్నికల కోడ్‌ ముగిసి నెలలు గడుస్తున్నాఇపుడు అదే పరిస్థితి కొనసాగుతున్నది. 

వ్యవసాయ అవగాహన సదస్సులు వెనక్కి మళ్లీ మొదటికొచ్చిన అధికారులు

వరంగల్‌,జూలై 19(జ్యోతి న్యూస్):-:-వ్యవసాయంలో రైతులకు మెళకువలపై ప్రతియేటా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు సదస్సులను నిర్వహించేవారు. సాగులో సలహాలు, సూచనలతో పాటురైతు సదస్సుల ద్వారా విస్తృతపరిచేవారు. రెండేళ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మన తెలంగాణ?మన వ్యవసాయ కార్యక్రమం ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతోపూర్తిగా నీరుగారిపోతుంది. 2018 ఖరీఫ్‌ నుంచి ఈ రైతు సదస్సులను నిర్వహించిన దాఖలాలు లేవు. మారుతున్న వాతావరణ పరిస్థితు లకు అనుగుణంగా ఎలాంటి పంటలు పండించుకోవాలన్నఅవగాహన కొరవడింది. గతంలో మన తెలంగాణ మన వ్యవసాయం పేరిట గ్రామాల్లో రైతు చైతన్య సదస్సుల నిర్వహణను నిర్వహించారు. ప్రస్తుతం రెండేళ్ల నుంచి రైతు సదస్సుల ఊసే లేకుండా పోయింది. ఏటా ఖరీఫ్‌కు నెల ముందువ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అనుబంధ శాఖల సమక్షంలో సూచనలు అందించి సాగుకు రైతులను సన్నద్ధం చేసేవారు. కానీ వ్యవసాయశాఖ అధికారులు సలహాలు, సూచనలు రైతులకు అందకతీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కొంతమంది రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలపై అవగాహన ఉండటం లేదు. రైతులు ఎక్కువగా రసాయన ఎరువులను వాడడంతో భూముల్లోనిభూసారాన్ని కోల్పోతున్నారు. పెట్టుబడి ఖర్చులు పెరిగి దిగుబడి అంతంత మాత్రమే వస్తుండడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. వ్యవసాయశాఖతోపాటు పశుసంవర్ధక, ఉద్యానవన పట్టుపరిశ్రమ, మత్స్యశాఖ, మార్కెటింగ్‌, అటవీ, బ్యాంకింగ్‌, రెవెన్యూ, విద్యుత్‌, సూక్ష్మ నీటి సేద్యం, నీటిపారుదల శాఖ తదితర శాఖలున్నాయి. శాఖల ద్వారా రైతులకు ప్రయోజనాలు రాయితీ తదితరఅంశాలపై అవగాహన కల్పించేవారు. 

‘పుర’ పోరు దసరాకే!

కోర్టు కేసులు, ప్రతిపక్షాల ఒత్తిడి, అన్ని పట్టణాలనుంచి ఫిర్యాదుల వెల్లువ  ----------------------------------------------  - గందరగోళంగా వార్డులు, డివిజన్లు  -ప్రతి పట్టణంలో ఫిర్యాదుల…

నూతన చట్టంతోనే పారదర్శకత

– అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం  – అక్రమమని తేలితే నోటీసులివ్వకుండానే కూల్చేస్తాం – 75గజాలలోపు ఇంటినిర్మాణానికి రిజిస్టేష్రన్‌ ఫీజు కేవలం…

మగపిల్లలకు బాధ్యతలు నేర్పాలి అమ్మాయిల పట్ల అసభ్యంగా ఉంటే అంతే సంగతులు: రేమారాజేశ్వరి

అమ్మాయిల పట్ల అసభ్యంగా ఉంటే అంతే సంగతులు: రేమారాజేశ్వరి మహబూబ్‌నగర్‌,జూలై 18: తల్లిదండ్రులు మగపిల్లలకు బాధ్యతలు చెప్పకపోవడం వల్ల చాలా మంది నెగెటివ్‌…

బిగ్‌..లా(బా)స్‌ ప్రసారానికి ముందే వివాదంలో బిగ్గెస్ట్‌ రియాలిటీ షో

* పార్టిసిపెంట్స్‌ ఎంపికనుంచి హోస్ట్‌ వరకూ అంతా వివాదమే  * రెండు సీజన్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్‌బాస్‌  * మూడో సీజన్‌…