మెదడు పై కరోనా వైరస్ ప్రభావం

ముంబయి: కరోనా వైరస్ కు సంబంధించిన కొత్త విషయాలు వణుకు పుట్టిస్తున్నాయి. కరోనా వైరస్ మెదడులోని శ్వాస నియంత్రణ కేంద్రం లోకి ప్రవేశించి ప్రభావం చూపుతుండటం వలన మరణాలు సంభవిస్తున్నాయని భావిస్తున్నారు.ఏసీఎస్‌ కెమికల్‌ న్యూరోసైన్స్‌లో కోల్ కత్తా శాస్త్రవేత్తల బృందం ప్రచురించిన ఈ విషయం కలవరం కలిగిస్తోంది. శ్వాస తీసుకున్నప్పుడు ఈ వైరస్ మెదడులోని ఓల్‌ ఫ్యాక్టరీ బల్బ్‌కు చేరుతోందని వారు గుర్తించారు. శ్వాసను నియంత్రించే పీబీసీ వ్యవస్థే ఈ వైరస్ దాడికి గురి అవుతూ ఉండడం వలన కోవిడ్ సంభవిస్తున్నట్లు భావిస్తున్నారు. మానవ శరీరంలోన ఇతర భాగాల కంటే ఊపిరితిత్తుల పైనే ఎక్కువ ప్రభావం చూపిస్తున్న కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడి మరణాలు సంభవిస్తున్నట్లు శాస్త్రవేత్తలు. భావిస్తున్నారు. మెదడులోకి వైరస్ ఎలా ప్రవేశిస్తుందన్న విషయంపై పరిశోధనలు జరగాల్సి ఉంది.