V3 న్యూస్ ప్రతినిధి కథనానికి స్పందన

చాగలమర్రి జూలై 17 ( విభారె న్యూస్) :: కర్నూల్ జిల్లా చాగలమర్రి గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా నష్టపోయిన వారి కష్టాలను తెలియజేస్తూ v3 న్యూస్ ఛానల్ లో వచ్చిన ఈ కథనానికి స్పందించిన స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చి తమ వంతు సహాయాన్ని అందించారు . V3 న్యూస్ ప్రతినిధి వల్లంకొండు సాయి అభ్యర్థన మేరకు బర్డ్స్ సేవా సంస్థ వారు స్థానిక చాగలమర్రి గ్రామంలోని మల్లెవేముల రస్తా లో వుండే నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు , మాస్కులు పంపిణీ చేయడం జరిగింది.అలాగే కులూరు రస్తా లో వుండే నిరుపేద కుటుంబాలకు కూడా నిత్యవసర వస్తువులు పంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో v3 న్యూస్ ప్రతినిధి వల్లం కొండు సాయి, బర్డ్స్ స్వచ్చంధ సేవా సంస్థ కో ఆర్డినేటర్ : భాస్కర్ , దేవదానం , చంద్ర తదితరులు పాల్గొన్నారు .