చాగలమర్రి :: (విభారె న్యూస్) ::కీర్తి శేషులు వల్లంకొండు ప్రసాద్ రావు గారి జ్ఞాపకార్థం కర్నూల్ జిల్లా చాగలమర్రి మండలం నగళ్లపాడు గ్రామ సమీపంలో వుండే వృద్ధాశ్రమంలో వృద్దులకు భోజనాలు పెట్టి వారి ఆకలి తీర్చడం జరిగింది. ఈ సందర్భంగా వల్లంకొండ సాయి మాట్లాడుతూ ఆకలితో ఉన్న వారికి కడుపు నింపడం తనకు ఎంతో తృప్తినిచ్చిందని తెలియజేశారు. అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్న వల్లంకొండ సాయిని పలువురు అభినందించారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులతో కలిసి సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వల్లంకొండు సాయి , యువతేజ , మహబూబ్ బాషా , నూర్ బాషా పాల్గొన్నారు.
Post Views: 319