ఆళ్లగడ్డ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా పి.సూర్యనారాయణ రెడ్డి గెలుపు

ఆళ్లగడ్డ ::(విభారె న్యూస్):: ఈరోజు జరిగిన ఆళ్లగడ్డ బార్ అసోసియేషన్ ఎన్నికలలో సీనియర్ న్యాయవాది
పి. సూర్యనారాయణ రెడ్డి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తమ సమీప ప్రత్యర్థి పి.సుబ్బరామిరెడ్డిపై 29 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 88 మంది న్యాయవాదులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో సూర్యనారాయణ రెడ్డి కి 58 ఓట్లు రాగా సుబ్బరామిరెడ్డికి 29 ఓట్లు, నోటా కు ఒక ఓటు వచ్చాయి. ఉపాధ్యక్షునిగా
జీ. మురళీధర్, జనరల్ సెక్రటరీగా నరసింహారెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా మల్లికార్జున రెడ్డి, మహిళా న్యాయవాది శ్రీమతి రమాదేవి, కోశాధికారిగా తిమ్మయ్య, గ్రంథాలయ ఇన్చార్జిగా అమర్నాథ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పలువురు న్యాయవాదులు, ఆర్లగడ్డ పట్టణ ప్రముఖులు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.