ఆళ్లగడ్డలో విశ్రాంత ఉద్యోగుల నూతన భవనం ప్రారంభించిన ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి

ఆళ్లగడ్డ :: (విభారె న్యూస్) :: ఆళ్లగడ్డడ పట్టణంలో నూతనంగా నిర్మించబడిన విశ్రాంత ఉద్యోగుల భవనానికి ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేశారు. ఆళ్లగడ్డ శాసన సభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నరసింహారెడ్డి, కమిషనర్ ఏవి రమేష్ బాబు , ఎస్సై రామిరెడ్డి ,తాసిల్దార్ రమేష్ రెడ్డి, వైకాపా నాయకులు ఎస్ వి జగన్ మోహన్ రెడ్డి, గజ్జల రాఘవేంద్ర రెడ్డి, సింగం వెంకటేశ్వర్ రెడ్డి, విశ్రాంత అధ్యాపకులు తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు