ప్రతిష్టాత్మక ఎం.డి.ఆర్.టీ అవార్డు సాధించిన ఆళ్లగడ్డ ఎల్ఐసి ఏజెంట్

ఆళ్లగడ్డ::( విభారె న్యూస్):: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎం డి ఆర్ టి అవార్డునకు ఆళ్లగడ్డ కు చెందిన ఎల్ఐసి ఏజెంట్ పల్లె మల్లికార్జున రెడ్డి ఎంపికయ్యారు.గ్రామీణ ప్రాంతానికి చెందిన ఏజెంట్ ను ఈ అవార్డుకు ఎంపిక సాధించేందుకు ప్రోత్సహించిన ఎల్ఐసి డెవలప్ మెంట్ ఆఫీసర్ ధరావత్ దేవా గారి కృషిని పలువురు ఉన్నతాధికారులు ప్రశంసించారు.ఈరోజు ఆళ్లగడ్డ ఎల్ఐసి ఆఫీస్ లో జరిగిన ఏజెంట్ల సమావేశంలో ప్రతిష్టాత్మక అవార్డు ఎంపికైన పల్లె మల్లికార్జున రెడ్డిని బ్రాంచ్ మేనేజర్ శ్రీ రామ శర్మ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో అధికారులు యు.భాస్కరయ్య, జె.వి.సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్,రవీంద్ర నాయక్,ఏజెంట్లు మరియు పాలసీదారులు పాల్గొన్నారు. ఎల్ సుబ్రహ్మణ్యం వందన సమర్పణ చేశారు.