ఆళ్లగడ్డ::(విభారె న్యూస్):: కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలోని చిన్న వంగలి, పెద్ద వంగలి గ్రామాల్లో భారీ వర్షాలకు పంట దెబ్బతిన్న పొలాలను శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వంలో నీరు చెట్టు పథకంలో జరిగిన అలుగుల నిర్మాణం నాసిరకంగా ఉండటంతో గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొట్టుకు పోవడం వలన దాదాపు 300 ఎకరాలలో పంట నష్టం జరిగిందని గంగుల తెలిపారు. మైనార్టీ నాయకుడు షేక్ బాబూలాల్, వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు.