ఆళ్లగడ్డ :: విభారె న్యూస్:: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద ప్రోత్సాహకం పెంచుతున్నట్లు ప్రకటించారు. సాధారణ ప్రసవానికి ఇప్పటివరకు ఇస్తున్న ప్రోత్సాహకాన్ని 3వేల రూపాయల నుండి 5వేల రూపాయలకు, సిజేరిన్ ప్రసవానికి సంబంధించి ప్రోత్సాహకాన్ని 1000 నుంచి 3 వేల రూపాయలకు పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆస్పత్రి సేవలు అధ్వాన్నంగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని, రెండు వారాల్లో పరిస్థితి మెరుగు పడాలని అధికారులను ఆదేశించారు.అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో తప్పనిసరిగా హెల్ప్‌డెస్క్‌లు ఉండాలని, ఆరోగ్యమిత్రలు ఆరు రకాల బాధ్యతలు నిర్వర్తించాలని పేర్కొన్నారు.