రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి :: భూమా కిషోర్

రెడ్డిఆళ్లగడ్డ :: (విభారె న్యూస్):: గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నీట మునిగిన మందలూరు, నాగిరెడ్డిపల్లె గ్రామాలలోని పంట పొలాలను భారతీయ జనతా పార్టీ ఆళ్లగడ్డ తాలూకా బాధ్యులు భూమా కిషోర్ రెడ్డి పరిశీలించారు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఆళ్లగడ్డ, రుద్రవరం, ఉయ్యాలవాడ మండలాల్లోని పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. ఈ కారణంగా మిరప, మినుము, వరి పంటలు దెబ్బతిని, రైతులు బాగా నష్టపోయారని ఆయన తెలిపారు. పంట నష్టం జరిగిన ప్రాంతాలను అధికారులు వెంటనే పంట నష్టాన్ని అంచనా వేయాలని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఆర్థిక సహాయం ప్రకటించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని భూమా కిషోర్ రెడ్డి కోరారు.