జయలింగేశ్వర రెడ్డిని అభినందించిన గంగుల.

ఆళ్లగడ్డ ::(విభారె న్యూస్) ఆళ్లగడ్డ పట్టణం లోని ప్రజ్ఞ కాలేజీ అధ్యాపక బృందం తమ ప్రతిభను రుజువు చేసుకుంది. వీరి కృషి ఫలితంగా ప్రజ్ఞ కాలేజీ విద్యార్థి జయ లింగేశ్వర రెడ్డిజే ఈ ఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ పరీక్షలో 95.5 శాతంతో ఉత్తీర్ణత సాధించారు. ఆళ్లగడ్డ ప్రజ్ఞ జూనియర్ కళాశాల విద్యార్థి బి.జయ లింగేశ్వర రెడ్డి ని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి అభినందించారు. సాధించాలనే పట్టుదల ఉంటే, విద్యార్థిని విద్యార్థులు దూర ప్రాంతాలకు ఉంటే వెళ్లనవసరం లేకుండా మన ఇంటి దగ్గరే ఉంటూ కృషి చేస్తే వారి లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు. గంగుల ప్రత్యేకంగా జయ లింగేశ్వర రెడ్డి విజయం సాధించడానికి కృషి చేసిన ప్రజ్ఞ జూనియర్ కళాశాల అధ్యాపక బృందాలను గంగుల ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో భౌతికశాస్త్ర ఉపన్యాసకులు జమాల్ బాషా, గణిత ఉపన్యాసకులు మహేష్, రసాయన శాస్త్ర ఉపన్యాసకులు భాస్కర్ పాల్గొన్నారు. ప్రజ్ఞకళాశాల తరఫున విద్యార్థి జయ లింగేశ్వర్ రెడ్డికి 5000 ప్రోత్సాహక బహుమతి అందించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు జయ లింగేశ్వర రెడ్డి అభినందించారు.