మూడు రాజధానులు తప్పులేదు:: హైకోర్టులో కేంద్రం అఫిడవిట్

అమరావతి::(విభారె న్యూస్)మూడు రాజధానులు విషయంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మూడు రాజధానులు పై ఏపీ హైకోర్టులో కేంద్రం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో కేంద్ర ప్రభుత్వం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు తప్పు లేదని కేంద్రం తేల్చిచెప్పింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. మూడు రాజధానులు పై కేంద్రం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ వలన వైయస్ జగన్ మహన్ రెడ్డి ప్రభుత్వానికి కొంత ఉపశమనం లభించి నట్లయింది. ఇటీవలే మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ సైతం ఆమోదం తెలిపారు. మూడు రాజధానులు పై అమరావతి ప్రాంత రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తుండగా మరోవైపు ఏపీ హైకోర్టు లో 3 రాజధానులు పై వాదనలు నడుస్తున్నాయి.