ఆళ్లగడ్డ :: (విభారె న్యూస్):: కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ మండలం లోని జి. జంబులదిన్నె గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాలను ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ప్రారంభించారు.అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎం.డి.ఓ మరియు డి.ఈ, వై.ఎస్. ఆర్. సి. పి మండల అధ్యక్షుడు గజ్జల రాఘవేంద్ర రెడ్డి, వైసిపి నాయకులు సుధాకర్ రెడ్డి, నరసింహారెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.ఆళ్లగడ్డ తాలూకా రుద్రవరం మండలం లోని కోటకొండ గ్రామంలో నూతన గ్రామ సచివాలయాన్ని నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి తో పాటు, గంగుల మనోహర్ రెడ్డి, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.