ఆళ్లగడ్డ ::( విభారె న్యూస్):: పట్టణంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని ఆర్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి తెలిపారు. అందుకు ప్రజలు అందరూ సహకరించాలని, అప్పుడు మాత్రమే కరోనా వైరస్ ను సమర్థవంతంగా నిరోధించగలమని గంగుల తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు పర్యవేక్షించేందుకు గ్రామ సచివాలయాలు నుండి గ్రామ వాలంటీర్లు మహిళా పోలీసులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రెండు గంటల తరువాత ఎలాంటి లావాదేవీలు జరగకూడదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు గంగుల బిజేంద్రారెడ్డి తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలో స్వల్పంగా మార్పులు చేసినట్టు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. దుకాణాలు తెలుసుకునేందుకు మధ్యాహ్నం రెండు గంటల వరకు అనుమతించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుజాత, కోవిడ్ ఇంచార్జ్ డాక్టర్ కిషోర్ రెడ్డి, ఆళ్లగడ్డ పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, వైద్య సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు.