ఆళ్లగడ్డ ::(విభారె న్యూస్):: కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలో ఆళ్లగడ్డ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పర్యవేక్షణ, పారిశుద్ధ్య నిర్వహణ మొదలగు అంశాలలో ఆళ్లగడ్డ పట్టణ మున్సిపాలిటీకి రెండు ప్రశంసాపత్రాలు రావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మునిసిపల్ కమిషనర్ రమేష్ బాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయినప్పటి నుంచి ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బందికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ అప్రమత్తం చేస్తూ, వైరస్ వ్యాప్తి చెందకుండా పట్టణ ప్రజలకు అవగాహన కలిగించారు. లాక్ డౌన్ సమయంలో నియమ నిబంధనలు కఠినంగా అమలు చేసి వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు నిర్విరామంగా కృషి చేశారు. వీరి కృషిని గుర్తించిన ప్రభుత్వముు వీరిరువురికీ ప్రశంసాపత్రాలు అందజేసింది. ఈ సందర్భంగా వీరికి మున్సిపల్ సిబ్బంది మరియు స్థానికులు అభినందనలు తెలియజేశారు.