చెన్నై :: కరోనా వ్యాధి సోకి తీవ్రమైన ఊపిరి పిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఢిల్లీకిచెందిన 48 ఏళ్ల వ్యక్తికి ఊపిరితిత్తుల మార్పిడి జరిగింది. కోవిడ్ -19 ద్వారా సంభవించే ఫైబ్రోసిస్ కారణంగా రెండు ఊపిరి తిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.వూపిరితిత్తులలో కొంత భాగం మాత్రమే పని చేస్తుండడం వలన అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దీంతో వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించారు. అయినప్పటికీ అతని పరిస్థితి మరింత దిగజారింది. జూలై 20 న ఘజియాబాద్ నుండి చెన్నైలోని ఎంజిఎం హెల్త్‌కేర్‌కు విమానంలో తరలించారు. ఈనెల 27న ఎంజీఎం ఆస్పత్రి వైద్యబృందం అతనికి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.