సాగు నీటిని సద్వినియోగం చేసుకోండి :: ఆళ్లగడ్డ శాసన సభ్యులు బిజేంద్రారెడ్డి

ఆళ్లగడ్డ ::(విభారె న్యూస్):: ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి గారు గండ్లేరురిజర్వాయర్ ద్వారా సాగునీరు నీరు విడుదల చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటల 15 నిమిషాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తర్వాత, జల హారతి ఇచ్చి రిజర్వాయర్ లోని సాగు నీటిని దిగువ బాగాన ఉన్న చెరువులకు విడుదల చేశారు. సాగునీటిని నీటిని ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని వృద్ధిలోకి రావాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆళ్లగడ్డ మార్కెట్ వైస్ చైర్మన్ నరసింహారెడ్డి, సుధాకర్ రెడ్డి, గంగుల రామిరెడ్డి, సింగం భరత్ రెడ్డి, శివ నాగ రెడ్డి, నాసారి వెంకటేశ్వర్లు, తెలుగు గంగ E.E. శంకర్ రెడ్డి గారు పాల్గొన్నారు.