ఆళ్లగడ్డలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన మాజీ సైనికులు
ఆళ్లగడ్డ ::(విభారె న్యూస్):: ఆళ్లగడ్డ లో మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 74 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు దస్తగిరి రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. దేశ రక్షణకై అసువులు బాసిన స్వాతంత్ర సమరయోధులకు, సైనికులకు నివాళులర్పించారు. ఆగస్టు 15 ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగిన రోజు అని దస్తగిరి రెడ్డి తెలిపారు. ఈ వేడుకలో, మాజీ సైనికోద్యోగి ల సంఘం ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి మరియు సభ్యులు పాల్గొన్నారు.