ఆళ్లగడ్డ::(విభారె న్యూస్):: ఆళ్లగడ్డ శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి గారు పట్టణంలోని గంగుల నివాస కార్యాలయంలో వైయస్సార్ చేయూత పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉందని, వారిని ఆర్థికంగా బలపరిచేందుకు వైయస్సార్ చేయూత పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమానికి ఎంపిడిఓ అక్రమ్ భాష, ఆళ్లగడ్డ మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, వైయస్సార్ సిపి నాయకులు గొట్లూరు సుధాకర్ రెడ్డి, గోపవరం నరసింహారెడ్డి, గజ్జల రాఘవేంద్ర రెడ్డి మరియు మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.