అనంతపురం: సంచలనం రేపిన వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టయిన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 50 రోజులుగా రిమాండ్‌లో ఉన్న వీరిద్దరికి మూడు కేసుల్లో అనంతపురం ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం బుధవారం బెయిల్ మంజూరు చేసింది. బీఎస్-3 వాహనాలను బీఎస్ -4 వాహనాలుగా చూపించి రిజిస్ట్రేషన్ చేసిన కేసులో వీరిద్దరిని గత జూన్ నెలలో హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరిని అనంతపురానికి తరలించారు. 154 లారీలకు తప్పుడు సర్టిఫికెట్లతో అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని ఆర్టీఏ అధికారులు వారిపై కేసులు పెట్టిన విషయం తెలిసిందే.