ఆళ్లగడ్డలో ఒకే వ్యక్తికి రెండవసారి కరోనా :: అయోమయంలో ప్రజలు, వైద్యాధికారులు

ఆళ్లగడ్డ :: (విభారె  న్యూస్)::  ఒకసారి కరోనా వ్యాధి సోకితే రెండవసారి రాదు అనుకొని  ప్రజలు అపోహ పడుతున్నారు. కానీ ఈ అపోహలను పటాపంచలు చేస్తూ ఆర్లగడ్డ లో ఒకే వ్యక్తికి రెండవసారి కరోనా పాజిటివ్ రావడంతో ప్రజలు, అధికారులు అయోమయంలో పడిపోయారు. పది రోజుల పాటు క్వారంటైన్ లో  కరోనాకు చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయిన వ్యక్తికి, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రెండు వారాలకు తిరిగి కరోనా పాజిటివ్ రావడంతో రెండవ సారి క్వారంటైన్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అరుదైన సంఘటన ఆళ్లగడ్డ పట్టణంలో జరిగింది. ఆర్లగడ్డ పట్టణానికి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈ నెల 2వ తేదీన కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో 11 రోజుల పాటు కర్నూలు లోని ప్రభుత్వ స్టేట్ కోవిడ్  క్వారంటైన్ లో చికిత్స పొంది, 12వ తారీకున డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయినప్పటి నుంచి రెండు వారాల వరకు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, ఈనెల 25వ తారీకు నుండి తీవ్ర జ్వరం,  తల నొప్పి రావడంతో కరోనా లక్షణాలు గా భావించి, రెండవ సారి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈనెల 30వ తారీఖున రెండవ సారి పాజిటివ్ రావడంతో మళ్లీ ప్రభుత్వ క్వారంటైన్ కు తరలించారు. ఈ సంఘటనతో వైద్య అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒకసారి కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి చికిత్స చేసేందుకు ప్రభుత్వానికి భారంగా ఉంది. వేళ తిరిగి రెండవసారి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని అధికారులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. కావున ఒక్కసారి కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి శరీరంలో దాదాపు 30 రోజుల వరకు కూడా కరోనా వైరస్ ఉండే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 30 రోజుల వరకు జాగ్రత్తలు పాటించడం మంచిదని,   రెండవ సారి కరోనా సోకదని అపోహ పడవద్దని వైద్యులు సూచిస్తున్నారు