అమరావతి :: గత ప్రభుత్వం తమకు కేటాయించిన భూములను ప్రస్తుత ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై అమరరాజా ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ హైకోర్టులో వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో చిత్తూరు జిల్లాలో అమరరాజా సంస్థకు ప్రభుత్వం 483 ఎకరాలు కేటాయించింది. ఇటీవల ఆ భూముల్లో 253 ఎకరాలను వెనక్కి తీసుకుంటున్నట్లు జీవో జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అమరరాజా సంస్థ రాష్ట్ర హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. న్యాయస్థానం విచారణ జరిపి ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలు చేయకుండా నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది