60 సంవత్సరాల నాటి తిరుమల గుర్తుకువస్తోంది :: టిటిడి ప్రతినిధులు

తిరుమల :: ఆధ్యాత్మికంగా ప్రపంచంలోనే ప్రముఖ స్థానం లో ఉన్న తిరుమల ఒకప్పుడు భక్త జన సమూహాలతో, భక్తుల హరినామ స్మరణతో, దద్దరిల్లి పోతూ ఉండేది. కానీ కరోనా ప్రభావం తో దాదాపు రెండు నెలల పాటు దర్శనాలు నిలిపివేశారు. ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి ప్రాంతంలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందడం వలన దర్శనానికి 12 వేల మందికి అనుమతి ఉన్నప్పటికీ అందులో సగం మంది కూడా దర్శనానికి వెళ్లడం లేదు. తిరుమలలో మాడవీధులు, వసతి గృహాలు ఖాళీగా వెలవెలబోతున్నాయి. నెల రోజులలో కేవలం రెండున్నర లక్షల మంది మాత్రమే శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దీనిని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భక్తుల రాక పూర్తిగా తగ్గిపోవడంతో తిరుమల ఆలయానికి రావలసిన ఆదాయం కూడా భారీగా తగ్గిపోయింది. మొత్తంమీద తిరుమలలో 60 సంవత్సరాల క్రితం నాటి పరిస్థితులు నెలకొన్నట్లు టిటిడి వర్గాలు చెబుతున్నాయి.