ప్రభాస్ 21వ చిత్రం గురించి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. దీనిపై వైజయంతీ మూవీస్ క్లారిటీ ఇవ్వబోతోంది. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రభాస్ అభిమానులకు సంతోషం మరియు ఆశ్చర్యం కలిగించే ప్రకటన చేస్తున్నామని, వేచి ఉండాలని పేర్కొంది. సినీ ప్రేక్షకులను ఉద్దేశించి ‘‘ ఇన్నాళ్లు మీరు ఎదురు చూసినందుకు మీకు సంతోషం కలిగించే సమాచారం ఇవ్వబోతున్నామని అంటూ వైజయంతీ మూవీస్ సంస్థ చేసిన ట్వీట్ గురించి అభిమానులు ఆలోచనల్లోకి వెళ్లిపోయారు. ప్రభాస్
ప్రస్తుతం‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్నారు. దీనికిి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ఇటీవలే విడుదలైంది. వైజయంతీ మూవీస్ సంస్థలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తదుపరి చిత్రం ఉండనుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ ఎవరనేది వెల్లడించలేదు. రేపు వైజయంతి మూవీస్ వారు ఇవ్వబోయే సర్ప్రైజ్ సమాచారం ఇదే అయ్యుంటుందని అభిమానులు ఊహించుకుంటున్నారు. బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ప్రభాస్ సరసన నటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.