అవన్నీ తొలగిస్తామని అమెరిరాలో ప్రకటించిన ఇమ్రాన్ ఇమ్రాన్ రాకను పట్టించుకోని అమెరికన్ వాషింగ్టన్,జూలై22: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ విూద ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్ ఇక్కడి పాకిస్థానీలను ఉద్దేశించి ఆయన సుమారు 50 నిమిషాల పాటు ప్రసంగించారు. వాషింగ్టన్‌లోని ఎరేనా స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆ స్టేడియం సామర్థ్యం 20వేల సీట్లు కాగా సుమారు 30 వేల మంది ఆ కార్యక్రమానికి రావడం గమనార్హం. నవాజ్ షరీఫ్ జైల్లో ఉన్నప్పటికీ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఆయనకు ఇంటి నుంచే భోజనం వస్తోంది. ఏసీ గదులు, టీవీలను ఏర్పాటు చేశారు. ఒక ఖైదీకి అన్ని సౌకర్యాలు ఉండటం నేరాన్ని ప్రోత్సహించి నట్లవుతుంది. పాకిస్థాన్‌లో సగం మందికి పైగా ప్రజలు ఏసీ, టీవీలు లేకుండా గడుపుతున్నారు. అలాంటప్పుడు ఆయనకి వేసిందీ ఒక శిక్షేనా? నేను వెళ్లిన తర్వాత షరీఫ్‌కు అవన్నీ లేకుండా చేస్తాను. ఏసీ, టీవీ వంటి సౌకర్యాలను తొలగిస్తాను. నవాజ్ కూతురు మరియం షరీఫ్ దీనిపై కొంత వివాదం సృష్టిస్తుందని నాకు తెలుసు. అయినప్పటికీ వదిలి పెట్టేది లేదు. ఇప్పటికే వారికి సంబంధించిన కొన్ని ఆస్తులను స్వాధీనం చేసుకొన్నాం. విదేశాల్లో వారు భారీగా సంపదను దాచుకున్నారు. ఈ విషయమై ఇతర
ప్రభుత్వాలను కూడా సాయం కోరుతున్నాం. వారు లూటీ చేసిన సొత్తునంతా వెనక్కి రప్పిస్తాం అని తీవ్రంగానే స్పందించారు.
ఇమ్రాన్‌కు స్వాగతంలో ఘోర అవమానం
అమెరికా పర్యటనకు వెళ్లిన ఇమ్రాన్ ఖాన్‌కు తొలుత ఘోర అవమానం ఎదురైంది. ఆయను ఆహ్వానించడానికి అమెరికా ప్రభుత్వ అధికారులెవరూ రాలేదు. పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి మహమ్మద్ ఖురేషీ, పెద్ద ఎత్తున అమెరికన్ పాకిస్థానీలు ఆయనను విమానాశ్రయంలో ఆహ్వానించారు. నేడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఆయన భేటీ కానున్నారు. పాక్ఉగ్రవాదం విషయంలో అమెరికా బహిరంగంగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అమెరికాలో ఘోర పరాభావం ఎదురైంది. మూడు రోజుల పర్యటన కోసం ఆయన వాషింగ్టన్ కు వచ్చారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఆయనకు అమెరికా మంత్రి స్వాగతం పలకాలి. కానీ ఆయనకు స్వాగతం పలికేందుకు ఒక్క అమెరికా మంత్రి కూడా రాలేదు. ఓ దేశ ప్రధాని అమెరికా వెళితే ఆ దేశ విదేశాంగ మంత్రి, లేకపోతే మరో మంత్రి స్వాగతం పలుకుతారు. ఇమ్రాన్ రాకకు ముందే అమెరికా వచ్చిన పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి, అమెరికాలోని పాక్ రాయబారులు మినహా అమెరికా అధికారులు స్వాగతం పలికేందుకు రాలేదు. దీంతో అమెరికా ప్రభుత్వ ఆతిథ్యం స్వీకరించకుండా, తమ రాయబారి అసద్ మజీద్ ఖాన్ ఇంట్లోనే బస చేయాలని ఇమ్రాన్ నిర్ణయించుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయి పలు అంశాలపై చర్చించనున్నారు.