పంచుకున్నా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు
విజయవాడ: కరోనా నియంత్రణ చర్యలపై ప్రధానికి ఇటవల రాసిన లేఖలో కొన్ని సూచనలు చేశానని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “సోమవారం ప్రధాని కార్యాలయానికి ఫోన్ చేశా.. ఆయనతో మాట్లాడాలని అడిగాను. అయితే, మంగళవారం ఉదయం 8.30 గంటలకు ప్రధాని నాకు ఫోన్ చేశారు. ఆయనతో నా ఆలోచనలు పంచుకున్నా” అని చంద్రబాబు తెలిపారు. ముందు జాగ్రత్తలు పాటిస్తూ వీరోచితంగా పోరాడాలి: చంద్రబాబు కంటికి కనిపించని శత్రువైన కరోనాను లాక్ డౌన్లో కొంతవరకు కట్టడి చేయగలుగుతున్నామని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “ఆర్థిక వ్యవస్థకు ఇదో పెను సవాల్ గా మారింది. ఈ సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. కొన్నిచోట్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరోనా పై అందరూ వీరోచితంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుటే లాక్ డౌన్ నిబంధనలు పాటించాలి. కరోనాతో అగ్రదేశాలూ అతలాకుతలమవుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు కట్టడి చేయగలుగుతున్నాయి.. మరికొన్ని సమర్థంగా చేయలేకపోతున్నాయి. ముందు జాగ్రత్తలు తీసుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం” అన్నారు.