ఢల్లీి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పీసీ చాకో రాజీనామా
చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యు
న్యూఢల్లీి: ఏళ్ల తరబడి దిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ చతికిపడిరది. వరుసగా రెండోసారి హస్తినలో ఖాతా తెరవలేకపోయింది. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థు డిపాజిట్లు కోల్పోవాల్సి వచ్చింది. అయితే తమ ఓటమిని కూడా పట్టించుకోకుండా కొందరు కాంగ్రెస్ నాయకు ఆమ్ ఆద్మీ విజయాన్ని హర్షించడంపై విమర్శు మ్లెవెత్తుతున్నాయి. చిదంబరం లాంటి సీనియర్ నేతు కేజ్రీవాల్ గొపును స్వాగతించడాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ తప్పుబట్టారు. దిల్లీ ఎన్నిక ఫలితాపై స్పందించిన చిదంబరం.. ‘భాజపా విభజన రాజకీయాు, ప్రమాదకర ఎజెండాను దిల్లీ ప్రజు ఓడిరచారు. అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం అక్కడ ఆయన పనితీరుకు నిదర్శనం. దిల్లీ ప్రజకు స్యోట్. 2021, 2022 సంవత్సరాల్లో ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికకు దిల్లీ ఉదాహరణగా నిలిచింది’ అని ట్వీట్ చేశారు. రానున్న ఎన్నికల్లో భాజపాకు ఇలాంటి ఫలితాలే పునరావృతమవుతాయని పరోక్షంగా పేర్కొన్నారు.
చిదంబరం ట్వీట్‌పై శర్మిష్ఠా ముఖర్జీ ఘాటుగా స్పందించారు. భాజపాను ఓడిరచే పనిని కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీకు అప్పగించిందా? అని ప్రశ్నించారు. ‘అలా కానప్పుడు ఎందుకు మనం మన పార్టీ ఓటమిపై ఆందోళన చెందకుండా ఆప్ విజయాన్ని ఆనందిస్తున్నామ’ని దుయ్యబట్టారు. ఒకవేళ ప్రాంతీయ పార్టీకు అప్పగించడమే నిజమైతే ‘మనం (ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీు) మన దుకాణాను మూసెయ్యాలి’ అంటూ ఎద్దేవా చేశారు. అంతకుముందు దిల్లీ ఎన్నిక ఫలితాపై స్పందించిన శర్మిష్ఠా.. ‘దిల్లీలో మళ్లీ ఓడిపోయాం. ఇక ఆత్మపరిశీను చాు.. చర్యు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. నిర్ణయాు తీసుకోవడంలో అసత్వం.. వ్యూహా కొరత.. రాష్ట్ర స్థాయిలో ఐకమత్యం లేకపోవడం లాంటి ఎన్నో కారణాున్నాయి. ఇందులో నాకు కూడా బాధ్యత ఉంది’ అని సొంతపార్టీపైనే విమర్శు చేశారు. అసెంబ్లీ ఎన్నిక ఫలితాు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చిచ్చుకు కారణమవుతున్నాయి. తాజా ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ ఢల్లీి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పీసీ చాకో తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ, సీనియర్ నేత అయిన చాకో మాట్లాడుతూ.. ఢల్లీిలో కాంగ్రెస్ పతనానికి మాజీ సీఎం షీలా దీక్షిత్ కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యు చేశారు.
2013లో షీలా దీక్షిత్ ఢల్లీి సీఎంగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పతనం మొదయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ సొంతం చేసుకుందన్నారు. పోయిన ఓటు బ్యాంకు తిరిగి పార్టీకి రాలేదని, ఆ ఓటు బ్యాంకు ఇప్పటికీ ఆప్‌తో ఉందని ఆయన పేర్కొన్నారు. పీసీ వ్యాఖ్యపై స్పందించిన మహారాష్ట్ర కాంగ్రెస్ నేత మిలింద్ దేవర చాకో వ్యాఖ్యతో విభేదించారు. నిజానికి షీలా అధికారంలో ఉండగా కాంగ్రెస్ ఓ మెగు వెలిగిందని మిలింద్ దేవర అభిప్రాయపడ్డారు.
ఆమె మరణాంతరం ఢల్లీిలో పార్టీ ఓటమికి షీలాను నిందించడం సరికాదన్నారు. ఆమె పార్టీకి, ఢల్లీి ప్రజకు తన జీవితాన్ని అంకితం చేశారని ఆయన పేర్కొన్నారు. కాగామొత్తం 70 స్థానాకు జరిగిన ఢల్లీి అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 62 స్థానాల్లో విజయం సాధించి మూడో సారి అధికార పగ్గాు చేపట్టగా.. బీజేపీ 8 స్థానాతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ 2015 మాదిరిగానే ఖాతా తెరవలేక ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.