కాంగ్రెస్ నేతలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- వాడి వేడిగా తెలంగాణ శాసనసభ సమావేశాలు
- అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య వాగ్వాదం
- రాష్ట్రం తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిందన్న భట్టి
- నిరూపించాలన్న సీఎం
- కాళేశ్వరం, భక్తరామదాసు ప్రాజెక్టులు కనబడటం లేదా?
- వాస్తవిక దక్పథంతోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం
- ఎన్నో రాష్ట్రాలకంటే ముందంజలో ఉన్నాం
- శాసనసభ బడ్జెట్ సమావేశాలలో చర్చించిన కేసీఆర్
- 22 వరకూ కొనసాగనున్న సమావేశాలు
‘కాంగ్రెస్ నేతలు కళ్లున్న కబోదుల్లా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షం వంకతో ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం. కాళేశ్వరం, భక్తరామదాసు ప్రాజెక్టులు వీరికి కన్పించడంలేదా?. మిషన్ కాకతీయ ద్వారా 27వేల చెరువులను నింపాం. తప్పుగా, అబద్దాలు మాట్లాడితే అడుగడుగునా అడ్డుకుంటాం. సభలో అందరం సమానమే. ప్రతిపక్షమనే వంకతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతామంటే కుదరదు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. కాంగ్రెస్‌ది ఐదేళ్లుగా ఇదే ధోరణి. ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టిన కాంగ్రెస్ నేతల బుద్ధి మారడంలేదు’ -కేసీఆర్
హైదరాబాద్:
తెలంగాణ శాసనసభ ఆదివారానికి వాయిదా పడింది. తిరిగి నేటి ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. అంతకుముందు బడ్జెట్‌పై సభలో వాడీవేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార తెరాస, కాంగ్రెస్ మధ్య వాగ్వాదం జరిగింది. రాష్ట్రం తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిందని, రూ.3లక్షల మేర అప్పు ఉందని భట్టి విక్రమార్క విమర్శించారు. ‘అంత అప్పు ఉందని నిరూపిస్తారా?’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదురు ప్రశ్నించారు. దీంతో కాసేపు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ నెల 22 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఆదివారం సైతం సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ ప్రాజెక్టులపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షనేత భట్టి విక్రమార్క సంధించిన పలు ప్రశ్నలకు స్వయంగా కేసీఆర్ సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుల ప్రస్తావన రాగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణను ముంచే పోలవరం వద్దని వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయం రికార్డుల్లో ఉంది కావాలంటే చూసుకోవాలంటూ ప్రతిపక్ష పార్టీల నేతలకు సూచించారు. ఇందిరాసాగర్ పేరుతో… పోలవరాన్ని ప్రతిపాదించి కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేసిందని గులాబీనేత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లాకు 100 టీఎంసీలు కేటాయించిన ఘనత టీఆర్ఎస్ సర్కార్‌దేనని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం!
‘కాంగ్రెస్ నేతలు కళ్లున్న కబోదుల్లా మాట్లాడుతున్నారు. ప్రతిపక్షం వంకతో ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం. కాళేశ్వరం, భక్తరామదాసు ప్రాజెక్టులు వీరికి కన్పించడంలేదా?. మిషన్ కాకతీయ ద్వారా 27వేల చెరువులను నింపాం. ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టిన కాంగ్రెస్ నేతల బుద్ధి మారడంలేదు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇందుకు స్పందించిన భట్టి.. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళ్తే ఇప్పటికే 35లక్షల ఎకరాలు పారేవన్నారు. అయితే.. ప్రాణహిత, దేవాదుల, దుమ్ముగూడెంకు గత ప్రభుత్వాలు ఖర్చుచేశాయని భట్టి చెప్పుకొచ్చారు.
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై వాడీవేడీ చర్చ జరుగుతోంది. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ ఉండగా.. ఇప్పుడు ఆరేళ్లకే దివాలా తీసిన ప్రభుత్వంగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి రాష్ట్రాన్ని హాస్యాస్పదంగా మార్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క విమర్శించారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. ”రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు మిగులు బడ్జెట్ ఉందంటున్నారు.. రాష్ట్రమే లేకుంటే బడ్జెట్ ఎక్కడిది? ఇదో పెద్ద జోకు. రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు మిగులు బడ్జెట్ ఎక్కడిది? రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు బడ్జెట్ తయారు చేయడానికే ప్రాతిపాదిక లేదు. ఆ మాట కూడా నేను స్పష్టంగా చెప్పాను. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు సభను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. చాలా మంది ఆర్థిక నిపుణులను సంప్రదించి బడ్జెట్‌ను రూపొందించాం. వాస్తవిక దక్పథంతోనే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టాం. ఎన్నో రాష్ట్రాలకంటే మనం చాలా ఉత్తమమైన స్థానంలో ఉన్నాం. ఇలాంటి అసత్యాలను ప్రచారం చేయకుండా ఉంటే మంచిది.” అంటూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్కపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి రూ. 3 లక్షల కోట్ల అప్పు ఉందని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించడంపై కేసీఆర్ స్పందించారు. ఈ రాష్ట్రానికి మూడు లక్షల కోట్ల రూపాయాల అప్పు ఉందా? దీన్ని రుజువు చేస్తారా? విషయ పరిజ్ఞానంతో మాట్లాడితే మంచిది. లేని దాన్ని ఉన్నట్టు.. 2 లక్షల కోట్ల అప్పును మూడ లక్షల కోట్ల అప్పుగా చూపిస్తే ఊరుకుంటామా? రుజువు చేస్తారా? ఇలాంటి అవాస్తవాలు మాట్లాడొద్దు. 2 లక్షల కోట్లు కూడా లేని అప్పును మూడు లక్షల కోట్లు అని చెప్పడం సరికాదు.
ఈ రాష్ట్రంలో మీకు అభివద్ధి కనబడడం లేదా? ఒక్క ప్రాజెక్టు కూడా మీకు కనబడడం లేదా? కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు టైమ్‌లో కడితే మీకు కనిపిస్తలేదా? భక్తరామదాసు ప్రాజెక్టును ఒక్క ఏడాదిలో పూర్తి చేశాం. ఇది కనబడుత లేదా? ఈ ప్రాజెక్టు ఉన్నది మీ జిల్లాలోనే కదా? లక్ష్మీ బ్యారేజీని ఇప్పటి వరకు 20 లక్షల మంది చూశారు. కళ్లున్న కబోదుల్లాగా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. తప్పుగా, అబద్దాలు మాట్లాడితే అడుగడుగునా అడ్డుకుంటాం. సభలో అందరం సమానమే. ప్రతిపక్షమనే వంకతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతామంటే కుదరదు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. కాంగ్రెస్‌ది ఐదేళ్లుగా ఇదే ధోరణి. ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెట్టినా మీ తీరు మారలేదు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆరు నెలల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్రానిదే. ప్రభుత్వం చెబుతున్న అంశాలు వాస్తవికానికి దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. విక్రమార్క వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించారు. భట్టి విక్రమార్క సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. మాట్లాడే ధోరణిలో తప్పుగా మాట్లాడడమే కాకుండా సభను తప్పుదోవ పట్టించడం సరికాదు. బడ్జెట్ పాఠంలో వివరంగా చెప్పినాను. అందులో చూపించిన ప్రతి లెక్క కాగ్ చెప్పినవే. బడ్జెట్లో చూపించిన లెక్కలు వంద శాతం కరెక్ట్. రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు మిగులు బడ్జెట్ ఉండే అనుడు పెద్ద జోక్. మాట్లాడుతున్నామని ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదు. విమర్శించొచ్చు కానీ లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు చెప్పడం సరికాదు. కాగ్ ధవీకరించిన లెక్కలనే సభ ముందు ప్రవేశపెట్టినం.
సత్యదూరమైన మాటలు మాట్లాడి సభ్యులను, ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదు. దేశంలో మాంద్యం నెలకొని ఉంది. దేశంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. వాస్తవాలను ఉన్నది ఉన్నట్టు ప్రజలకు చెబుతాం. వాస్తవిక ద క్పథంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం. రాష్ట్రాన్ని దివాళా తీయించలేదు. దేశంలో మనం నంబర్‌వన్‌గా ఉన్నాం. ఆర్థిక నిపుణులను సంప్రదించిన తర్వాతే బడ్జెట్‌ను రూపొందించాం. మాంద్యం ప్రభావంతో బడ్జెట్లో కోత పెట్టామని మేమే చెప్పాం. ప్రతి లెక్కను రేపు సభ ముందు పెడుతాం. సభలో ఏది పడితే అది మాట్లాడడం సరికాదు అని సీఎం