భారతీయులందరినీ ఐక్యంగా ఉంచాలంటే ఒక్కటే భాష ఉండాలి: అమిత్‌షా
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా భారత్‌కు విశిష్ట గుర్తింపు ఉండేలా దేశవ్యాప్తంగా ఒకే భాష ఉండాలని.. మన దేశంలో ఎక్కువమంది మాట్లాడే హిందీ వల్లే అది సాధ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారతదేశం అనేక భాషలకు నిలయమని.. ప్రతి భాషకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అయితే భారతీయులందరినీ ఐక్యంగా ఉంచాలంటే ఒకే భాష ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు హిందీ దివస్ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ తమ మాతభాష వాడకాన్ని పెంపొందిస్తూనే.. హిందీని కూడా ఉపయోగించాలని కోరారు. అప్పుడే బాపు, సర్దార్ పటేల్ కలల్ని నెరవేర్చగలమన్నారు. అనంతరం దిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈశాన్య రాష్ట్రాల్లో హిందీని తప్పనిసరి చేయనున్నామన్నారు.
అమిత్ షా వ్యాఖ్యలపై తమిళనాడులోని డీఎంకే తీవ్రంగా మండిపడింది. అమిత్ షా తన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆ పార్టీ అధినేత స్టాలిన్ డిమాండ్ చేశారు. బలవంతంగా హిందీని రుద్దడంపై డీఎంకే ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోందని గుర్తుచేశారు. దీనిపై ప్రధాని మోదీ వెంటనే స్పందించాలని, లేదంటే మరో భాషా ఉద్యమానికి సిద్ధమవుతామని ఆ పార్టీ వర్గాలు హెచ్చరించాయి. అటు కర్ణాటకలోనూ అమిత్‌షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భాషాభిమానులు రోడ్లపై నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ విభాగం స్పందిస్తూ.. భారత్ అనేక భాషలు, సంస్క తులకు నిలయమని, ఒకే భాష విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి, తణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ.. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతభాషకే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. అన్ని భాషల్ని సమానంగా గౌరవించాలని సూచించారు.
గతంలో ఇదే విషయంపై నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా విడుదల సందర్భంగా తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. 3-8ఏళ్ల వయసు మధ్య పిల్లలు హిందీ సహా మూడు భాషలు నేర్చుకోవాలన్న నిబంధనను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో దాని స్థానంలో పిల్లలు తమకు నచ్చిన ఏవైనా మూడు భాషల్ని ఎంచుకునే వెసలుబాటును కల్పిస్తూ కేంద్ర సవరణలు చేసింది. హిందీ తప్పనిసరి అన్న నిబంధనను తొలగించారు.
ఏకీకత భాషగా హిందీని అమలు చేయడం ద్వారా దేశ పౌరులందరినీ ఏకతాటిపైకి తీసుకురావచ్చన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అమిత్ షా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేయగా.. తాజాగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సైతం ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘బలవంతంగా హిందీ భాషను రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ మేం నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాం. ఈ రోజు అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మాకు షాక్ ఇచ్చాయి. ఈ వ్యాఖ్యలు దేశ ఐక్యతను దెబ్బతీస్తాయి. అమిత్ షా తన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం’ అని స్టాలిన్ పేర్కొన్నారు. తీవ్ర ఆందోళనకు గురిచేసిన షా వ్యాఖ్యలపై ఎల్లుండి పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో చర్చించి.. తదుపరి కార్యాచరణ చేపడతామని స్టాలిన్ పేర్కొన్నారు.
శనివారం హిందీ దివస్ సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తూ..భారత్‌లో అత్యధికులు మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యమత్యంగా ఉంచడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. అదే విధంగా..’ భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. ప్రతీ భాష దేనకదే ప్రత్యేకతను కలిగి ఉంది. అయితే ప్రపంచంలో భారత్ గుర్తింపు కోసం ఒక భాష మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు దేశాన్ని ఒక్కటిగా ఉంచే భాష ఏదైనా ఉందంటే అది హిందీ మాత్రమే. స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాంధీ, వల్లభబాయ్ పటేల్ ఆశయాలను నెరవేర్చాలంటే మాతభాషతో పాటు హిందీ భాష వాడకాన్ని పెంచాలి’ అని ట్విటర్ వేదికగా భారత ప్రజలకు విజ్ఞప్త్తి చేశారు.