మతసామరస్యానికి ప్రతీక గా నిలిచిన ఆళ్లగడ్డ గణేష్ నిమజ్జనోత్సవం : ఆవుల విజయభాస్కర రెడ్డి

నిమజ్జనోత్సవం : ఆవుల విజయభాస్కర రెడ్డి
ఆళ్లగడ్డ: విభారె న్యూస్ :తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితుల్లో కూడా ఆళ్లగడ్డలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ శ్రీ గణేష్ ఉత్సవ కేంద్ర సమితి అధ్యక్షులు ఆవుల విజయభాస్కర రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత కారణంగా గణేష్ నిమజ్జనానికి అనువైన ప్రదేశాలను ఏర్పాటు చేయడం పెద్ద సవాలుగా మారిందన్నారు. అయితే అధికారులు, ప్రజలు, గణేష్ మంటపాల నిర్వాహకులు, వివిధ శాఖల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగామని తెలిపారు.
ముఖ్యంగా ఈ క్లిష్ట పరిస్థితుల్లో నిమజ్జన కార్యక్రమానికి పూర్తిస్థాయి సహకారం అందించిన ఆవుల రామ పుల్లయ్యకు శ్రీ గణేష్ ఉత్సవ కేంద్ర సమితి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిమజ్జన కార్యక్రమంలో పూర్తి సహాయ సహకారాలు అందించిన పోలీసు అధికారులు మున్సిపల్ అధికారులు, పారిశుధ్య కార్మికులు, విద్యుత్ శాఖ అధికారులు మరియు సిబ్బందికి, మత్స్యశాఖ అధికారులు మరియు సిబ్బందికి, ఫైర్ సర్వీస్ శాఖ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అలాగే నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు సమితితో, అధికారులతో సమన్వయం చేసుకుని సహకరించిన గణేష్ మంటపాల నిర్వాహకులందరినీ ఆయన అభినందించారు.
కాశింతల పుణ్యక్షేత్ర దేవాలయ కమిటీ అందించిన సహకారాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. గణేష్ నిమజ్జన కార్యక్రమం ఒక్కరి కృషితో సాధ్యం కాలేదని, హిందూ సంస్థలు, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది, మంటప నిర్వాహకులు, సేవా సంస్థలు, యువత, మహిళలు, ప్రజలు సమిష్టిగా సహకరించడం వల్లే ఈ కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు.
భేదభావం లేకుండా అన్ని మతాలవారు ఈ వినాయక చవితి ఉత్సవాలలో మరియు నిమజ్జన సంబరాలలో పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో వినాయక చవితి మరియు నిమజ్జన ఉత్సవాల సందర్భంగా మతసామరస్యం కళ్ళకు కట్టినట్టు కనపడిందని భవిష్యత్తులో కూడా మతసామరస్యానికి ఆళ్లగడ్డ ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సమన్వయం, సహకారం, సోదరభావంతో గణేష్ ఉత్సవాలను మరింత భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో మరియు పర్యావరణహితంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నీలకంటేశ్వరం, మురళీధర్ గౌడ్, గాదంశెట్టి గణేష్, ఉపాధ్యక్షులు గ్యాస్ పుల్లయ్య, కార్యదర్శి సోముల శ్రీనివాసరెడ్డి, దామోదర్ రెడ్డి మరియు శ్రీగణేష్ ఉత్సవ కేంద్ర సమితి సభ్యులు పాల్గొన్నారు.