విశ్వహిందూ పరిషత్,ఆళ్లగడ్డ వారి విజ్ఞప్తి

మన ఆళ్లగడ్డ, మన బాధ్యత

ప్రియమైన ఆళ్లగడ్డ పట్టణ ప్రజలకు, వ్యాపార సోదరులకు నమస్కారం.
మన సంస్కృతి చెప్పిన గొప్ప మాట “స్వచ్ఛతే దైవత్వం”. శుభ్రంగా ఉన్న ఇంటిలో, శుభ్రంగా ఉన్న ఊరిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు చెబుతారు. మన ఆళ్లగడ్డను అలాంటి లక్ష్మీ నిలయంగా మార్చుకునే బాధ్యత మనందరిపైనా ఉంది.
మన చెత్తను రోడ్డుపై వేయడం చిన్న పని అనిపించవచ్చు. కానీ అదే అలవాటు వందల మంది ఆచరిస్తే మన వీధులు మురికిగా మారతాయి. గాలికి ఎగిరే ఆ చెత్త మన ఆళ్లగడ్డ పట్టణమంతా వ్యాపిస్తుంది. దీనివలన చెత్త సేకరించేందుకు పారిశుద్ధ్య కార్మికులకు ఎక్కువ శ్రమ మరియు సమయం పడుతుంది.
గుర్తుంచుకోండి, మన పారిశుద్ధ్య కార్మికులు కూడా మనలాంటి మనుషులే. వారి సంఖ్య చాలా తక్కువ. మనం కొంచెం సహకరిస్తే వారి శ్రమ ఎంతో తగ్గుతుంది. మన ఇంటి చెత్తను, దుకాణం వ్యర్థాలను మన ఆవరణలోనే భద్రపరచుకుందాం. మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడు మాత్రమే వారికి అందిద్దాం. ఇది వారికి మనం ఇచ్చే గౌరవం, సహాయం.
బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం చట్ట విరుద్ధం, సమాజ ధర్మానికి కూడా విరుద్ధం. ఇకపై నిబంధనలు కఠినంగా అమలు కానున్నాయి. భారీ జరిమానాలు, అవసరమైతే పోలీసు శాఖ సహాయం తీసుకుని చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడానికి మున్సిపల్ అధికారులు సిద్ధమవుతున్నారు. సచివాలయ అధికారులు దుకాణాల ముందు పడవేసిన చెత్తను ఫోటో తీసి ఆ దుకాణ యజమానికి నోటీసులు ఇచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. కానీ మనం బాధ్యత తో చేయాల్సిన పని భయంతో చేయకూడదు.
ఆళ్లగడ్డ మనది. దీన్ని పరిశుభ్రంగా, సుందరంగా ఉంచుకోవడానికి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి దుకాణం ముందు ఒక చెత్త బుట్ట ఉంచుకోండి. ప్రతి ఇంటి ముందు పరిశుభ్రత పాటిద్దాం. మన వీధిని మనమే శుభ్రం చేసుకుంటే, రేపు మన ఊరంతా ఆరోగ్యంగా ఉంటుంది. మన దుకాణం పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన వ్యాపారాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయి.
మార్పు మనతోనే మొదలు కావాలి. మనం వేసే ఒక్క అడుగు, మన పట్టణానికి కొత్త అందాన్ని ఇస్తుంది. రండి, మాటలతో కాదు చేతలతో చూపిద్దాం. స్వచ్ఛమైన ఆళ్లగడ్డ కొరకు ఆచరించి చూపిద్దాం. క్రమశిక్షణతో మెలుగుదాం.

మన ఆళ్లగడ్డ, మన బాధ్యత, మన గర్వం.

                         ఇట్లు  
           విశ్వహిందూ పరిషత్ ఆళ్లగ