విభారె న్యూస్: ఆళ్లగడ్డ, మే 16:
ఆళ్లగడ్డ పట్టణంలో శనివారం పోలీసులు భారీ ఎత్తున కార్డెన్ అండ్ సెర్చ్ (ఆకస్మిక తనిఖీలు) నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, అనుమానిత కదలికలపై నిఘా ఉంచేందుకు పోలీసులు ఈ ఉమ్మడి తనిఖీలు చేపట్టారు.కుమ్మరి కొట్టాల, చైతన్య స్కూల్, రామలక్ష్మి థియేటర్ మరియు స్థానిక పాఠశాల పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు . పోలీసులు ఆయా ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని ప్రతి ప్రతి కూడలిని జల్లెడ పడుతూ విస్తృత సోదాలు నిర్వహించారు.
ఈ సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా రోడ్లపై వెళ్తున్న మోటార్ సైకిళ్లు, ఆటోలు మరియు ఇతర వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనదారులకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను నిశితంగా పరిశీలించారు. ఈ భారీ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో ఆళ్లగడ్డ డీఎస్పీ స్వయంగా పాల్గొని సిబ్బందిని పర్యవేక్షించారు. ఆయనతో పాటు అర్బన్, రూరల్ పోలీస్ స్టేషన్లకు చెందిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు మరియు పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ఈ తనిఖీల్లో ఎవరైనా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారా? ఏవైనా అక్రమ సామాగ్రి దొరికిందా? అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.