గురు పౌర్ణిమ సందర్భంగా ప్రముఖ యోగా గురువు వెంకటాద్రి గారికి ఘన సన్మానం

విభారె న్యూస్:: ఆళ్లగడ్డ :: ఆళ్లగడ్డ పట్టణంలోని ఆవుల పుల్లారెడ్డి సేవా సమితి ఆవరణంలో గురు పౌర్ణిమ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు శ్రీ వెంకటాద్రి గారిని ఆయన శిష్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యజీవితంలో యోగాభ్యాసము ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని ప్రతి దినము యోగాభ్యాసం చేయుట ద్వారా ఎన్నో రకాల జబ్బులను దూరం చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అనేకమంది పట్టణ ప్రముఖులు యోగా గురువు వెంకటాద్రి గారి విలువైన సేవలను కొనియాడారు. ఒకవైపు ఉపాధ్యాయ వృత్తి నిర్వహిస్తూ, క్రమం తప్పకుండా ప్రతిరోజు యోగ విద్యను బోధిస్తూ మార్గదర్శకంగా నిలిచారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి యోగా గురువు ధన్యవాదాలు తెలిపారు.