ఆళ్లగడ్డ:(విభారె న్యూస్): ఆళ్లగడ్డ పట్టణంలో రెండు తో ప్రారంభమైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య నేడు 19కు చేరింది. ఎల్.ఎం. కాంపౌండ్1 , సత్రం వీధి 1, కరోనా పరీక్షా ఫలితాలు పాజిటివ్ రావడంతో కేసుల సంఖ్య 19కి చేరింది. కరోనా వైరస్ బారిన పడి ఇప్పటివరకు ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల వద్ద, దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించకుండా అధికారులు చెప్పిన సూచనలు వినకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆర్లగడ్డ పట్టణంలో లో కరోనా పాజిటివ్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. చాలామది బయటికి వెళ్ళేటప్పుడు కనీసం మాస్కు కూడా ధరించడం లేదు. సద్దాం కాలనీలో కూడా ఒక కరోనా పాజిటివ్ కేసు వచ్చినట్లు అనధికారిక సమాచారం. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. దీంతో మొత్తం ఆళ్లగడ్డలో కరోనా పాజిటివ్ కేసులు 20 కి చేరవచ్చు. అసలే పరిశుభ్రత అంతంతమాత్రంగా ఉన్న ఆళ్లగడ్డ పట్టణంలో ప్రజలు కళ్ళు తెరవకుంటే కరోనా కేసుల వ్యాప్తి విపరీతంగా పెరిగి పోవడం ఖాయమని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆచరించేందుకు ఏమాత్రం కష్టం లేని సలహాలు సూచనలు కూడా పాటించకుంటే ఆళ్లగడ్డ కూడా మరో కర్నూల్ అవుతుందని ఆళ్లగడ్డ ప్రజలు అనుకుంటున్నారు. కనుక ప్రజలు ఎలాగూ ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించరు. అధికారులు కూడా దాదాపు చేతులెత్తేశారు. కనుక ప్రజలే క్రమశిక్షణ కలిగి నిబంధనలు పాటిస్తే కరోనా బారిన పడకుండా తప్పించుకోగలరు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ రమేష్ బాబు తెలిపారు.