ఆళ్లగడ్డలో రేపటి నుంచి పూర్తి లాక్ డౌన్ విధించే యోచనలో అధికారులు : 12 కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

ఆళ్లగడ్డ:(విభారె న్యూస్): కంటికి కనపడకుండా చాపకింద నీరులా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఆళ్లగడ్డ పట్టణంలో సరిగ్గా వారం రోజుల కిందట రెండు తో ప్రారంభమైన కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య నేడు 12కు చేరింది. ఎల్.ఎం. కాంపౌండ్ 8, సత్రం వీధి 1, సామిల్ స్ట్రీట్ 1, బృందావన్ కాలనీ 1, ఆచారి కాలనీ 1 మొత్తం 12 కరోనా పరీక్షా ఫలితాలు పాజిటివ్ వచ్చాయి. దీంతో పట్టణ వాసులు భయభ్రాంతులు అవుతున్నారు. సామాజిక దూరం పాటించకుండా అధికారులు చెప్పిన సూచనలు వినకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఆర్లగడ్డ వాసులు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అవసరం ఉన్నా లేకున్నా రోడ్ల వెంట తిరుగుతూ, దారిన వెళ్తున్న కరోనా వైరస్ ను చంక కెత్తుకుని ఇంటికి తీసుకెళ్ళి కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. ఇప్పటికైనా ఆళ్లగడ్డ పట్టణ ప్రజలు కళ్ళు తెరవకుంటే కరోనా కేసుల వ్యాప్తిలో ఆళ్లగడ్డ, మరో కర్నూలు కాగలదని ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారులు హెచ్చరికలు సూచనలు బేఖాతరు చేసినందుకు కచ్చితంగా ఫలితం అనుభవించాల్సి వస్తుందని ప్రజలు అంటున్నారు. కనీసం ఏ మాత్రం బరువులేని మాస్కు ధరిచేందుకు కూడా బద్ధకం అయితే ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఆచరించేందుకు ఏమాత్రం కష్టం లేని సలహాలు సూచనలు కూడా పాటించకుంటే ఆళ్లగడ్డ కూడా మరో కర్నూల్ అవుతుందని ఆళ్లగడ్డ ప్రజలు అనుకుంటున్నారు. కనుక ప్రజలు ఎలాగూ ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించరు. కనుక నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇక అధికారులే ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపటి నుంచి ఆళ్లగడ్డ పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్ విధించే విషయంపై అధికారులు ఈరోజు నిర్ణయం తీసుకోనున్నారని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ రమేష్ బాబు తెలిపారు